NTV Telugu Site icon

Viral news: ఆ ఊరిలో నైటీలు వేసుకుంటే భారీ ఫైన్ .. ఎందుకో తెలుసా?

Nty

Nty

ఆరోజుల్లో అమ్మమ్మలు, అమ్మలు ఎప్పుడూ చీరలో కనిపించేవారు.. కానీ ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళితేనే చీరల్లో కనిపిస్తున్నారు.. మిగతా టైం లో ఎక్కువగా నైటీలలో కనిపిస్తున్నారు.. పెళ్ళైన, పెళ్లి కానీ అమ్మాయిలు అందరు నైటీలను ఎక్కువగా వేసుకుంటున్నారు.. ఇక ఈరోజుల్లో ఆడవాళ్లు వేసుకొనే దుస్తుల విషయంలో ఎటువంటి పరిమితులు, షరతులు లేవు కాబట్టి ఎక్కువగా పగలు రాత్రి తేడా లేకుండానే నైటీలను వేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో పల్లెలు, పట్టణాలు, నగరాలు, మహానగరాలు అనే తేడా లేకుండా మహిళలు, యువతులు నైటీలు వేసుకోవడం సర్వసాదారణమైపోయింది..

అయితే, గతంలో మన దేశంలోనే ఏదో ప్రాంతంలో నైటీలు వేసుకున్న ఆడవాళ్లకు జరిమానా విధించినట్లుగా వార్తలు విన్నాం. కానీ ఇప్పుడు అలాంటి విచిత్రమైన వార్త మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనే వెలుగు చూసింది.. పశ్చిమగోదావరి జిల్లాలోని తోకలపల్లి గ్రామంలో మహిళలు, యువతులు పగలు నైటీలను వేసుకోవటాన్ని గ్రామపెద్దలు నిషేధించారు. కాదు కుదరదని ఎవరైనా నైటీలు వేసుకుంటే రెండు వేల రూపాయల జరిమానా కట్టాలని తీర్మానించారు. పగలు నైటీలు వేసుకున్న వారి గురించి చెప్పిన వారికి వెయ్యి రూపాయల బహుమానం ఇస్తామని కూడా ప్రకటించారు ఆ పెద్దలు..

ఈ విషయాన్ని కొందరు వ్యతిరేకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.. నిడమర్రు ఎమ్మార్వో ఎం.సుందర్రాజు, ఎస్ఐ విజయకుమార్ గ్రామంలో పర్యటించి వాస్తవాలు తెలుసుకొన్నారు. తెలుగు సాంప్రదాయం, సంస్కృతిని కాపాడాలనే ధ్యేయంతో పగటిపూట మహిళలు నైటీలను ధరించి రహదారులపైకి రాకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ఆ గ్రామ పంచాయితీ పెద్దలు చెప్పుకొచ్చారు.. దేశ ఔనాత్యాన్ని చాటేందుకు వాళ్లు చేస్తున్న ప్రయత్నం వల్ల అతను ఏమి మాట్లాడలేక పోయాడు.. అలా ఇప్పుడు అక్కడ నైటీలు వేసుకుంటే భారీ ఫైన్ వేస్తారు.. ఇలా అన్ని ఊర్లల్లో వేస్తె బాగుండు ఆడవాళ్లు చీరల్లో కనిపిస్తారు..