Site icon NTV Telugu

విక్టరీ వెంకటేశ్ ‘నారప్ప’ సెన్సార్ పూర్తి

వెంకటేశ్‌, ప్రియమణి, కార్తీక్ రత్నం, రావు రమేశ్‌, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా ‘నారప్ప’. తమిళ చిత్రం ‘అసురన్’ కు ఇది తెలుగు రీమేక్‌. ఈ చిత్ర నిర్మాత అయిన కలైపులి ధాను తెలుగు సినిమాకూ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. సురేశ్‌ బాబు నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. తాజాగా ‘నారప్ప’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది. తమిళ చిత్రం ‘అసురన్’ సైతం అప్పట్లో ఇదే సర్టిఫికెట్ పొందింది.

Read Also: నాగార్జున స్థానంలోకి రానా!

నారప్పగా వెంకటేశ్ నటిస్తే, విభిన్న పాత్రలు చేయడానికి మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి సుందరమ్మగా చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన ప్రచార చిత్రాలకు, నార‌ప్ప టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే… రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే దాఖలాలు కనిపించడంలేదు. ఒక వేళ తెరుచుకున్నా, జనం ఎంతవరకూ థియేటర్ల వద్దకు వస్తారో సందేహమే. అందుకే ఈ చిత్ర నిర్మాతలు సురేశ్‌ బాబు, కలైపులి థాను ‘నారప్ప’ను అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా జూలై 24న విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

Exit mobile version