రివ్యూ: వరుణ్ డాక్టర్ (తమిళ డబ్బింగ్)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘రెమో, సీమరాజా, శక్తి’ వంటి చిత్రాలతో తమిళ హీరో శివ కార్తికేయన్ తెలుగువారికి చేరువయ్యాడు. అతనితో నెల్సన్ రూపొందించిన ‘వరుణ్ డాక్టర్’ మూవీ తమిళ, తెలుగు భాషల్లో శనివారం జనం ముందుకు వచ్చింది. నాని ‘గ్యాంగ్ లీడర్’, శర్వానంద్ ‘శ్రీకారం’ చిత్రాలలో నటించిన ప్రియాంక అరుల్ మోహన్ ఇందులో హీరోయిన్.
వరుణ్ (శివ కార్తికేయన్) ఆర్మీ డాక్టర్. అతనికి పద్మిని (ప్రియాంక అరుల్ మోహన్)తో నిశ్చితార్థం జరుగుతుంది. అయితే ప్రతి విషయంలోనూ ప్రాక్టికల్ గా ఉండే వరుణ్ కు, తనకు పొసగదనే విషయం గ్రహించిన పద్మిని పెళ్ళికి ముందే బ్రేకప్ చెప్పేస్తుంది. అదే సమయంలో ఆమె అన్నయ్య కూతురు కిడ్నాప్ కు గురౌతుంది. పద్మినితో బ్రేక్ అప్ అయినా ఆ పాపను రక్షించడానికి ఈ ఆర్మీ డాక్టర్ ఏం చేశాడన్నదే ఈ చిత్ర కథ.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
నయనతార, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించిన ‘కొలమావు కోకిల’ చిత్రంతో నెల్సన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం విజయ్ హీరోగా ‘బీస్ట్’ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ మధ్యలో వచ్చిందే ‘వరుణ్ డాక్టర్’ మూవీ. ఐదేళ్ళ క్రితం ‘రెమో’లో నర్స్ వేషం వేసిన శివ కార్తికేయన్, ఇప్పుడు డాక్టర్ గా నటించాడు. చిత్రం ఏమంటే… నెల్సన్ ఎంచుకున్నది చాలా సీరియస్ సబ్జెక్ట్. హ్యూమన్ ట్రాఫికింగ్ చుట్టూ అతను ఈ కథను అల్లాడు. అయితే దాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించాడు. స్కూల్ లో చదువుకునే పాపను కొందరు కిడ్నాప్ చేయడం, ఆ చిన్నారిని వెతుక్కుంటూ ఇంటి సభ్యులంతా డాక్టర్ వరుణ్ ప్లాన్ ప్రకారం గోవాకు వెళ్ళడం, అక్కడ విలన్ తో తలపడటం అంతా ఓ హై డ్రామాను తలపిస్తుంది. దీనికి తోడు ప్రతి సన్నివేశంలోనూ దర్శకుడు వినోదానికి ప్రాధాన్యమిచ్చాడు. కొన్ని చోట్ల సిట్యుయేషనల్ కామెడీని, మరికొన్ని చోట్ల డైలాగ్ కామెడీని ఆశ్రయించాడు. దాంతో ఎంచుకున్న కథ ఏమిటీ, దాన్ని చూపిస్తున్న విధానం ఏమిటనే ప్రశ్న ఆడియెన్స్ మనసులో కలుగుతుంది. ప్రతి విషయంలోనూ ప్రాక్టికల్ గా ఉండే డాక్టర్ వరుణ్… హీరోయిన్ తండ్రికి ‘నేను సాఫ్ట్ కాదు పొగరబోతుని’ అని చెప్పడంలో ఆంతర్యం అర్థం కాదు. అయితే, పొగరబోతు అని కాకుండా ‘నేనూ పట్టుదల కలవాడినే’ అని చెప్పి ఉంటే బాగుండేది. హీరోయిన్ తో బ్రేకప్ అయినా, మానవత్యంతో ప్రాణాలకు తెగించి, ఆమె అన్న కూతురు కోసం రకరకాల ప్లాన్స్ వేస్తాడు కాబట్టి!
నటీనటుల విషయానికి వస్తే శివ కార్తికేయన్ ఈ పాత్రను బాగానే చేశాడు కానీ ఎందులో నూరుశాతం ఇవ్వలేదనిపిస్తుంది. పైగా ఈ సినిమా తమిళ వర్షన్ కు అతనే నిర్మాత కూడా. కొన్ని చోట్ల ఏదో రోబోలా నటించాడు. పైగా క్లయిమాక్స్ మరీ చిత్ర విచిత్రంగా, ఏదో పాతికేళ్ళ క్రితం సినిమాలా అనిపించింది. ఇక హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ కు కిడ్నాప్ డ్రామాలను వెతికి మరీ దర్శక నిర్మాతలు ఇస్తున్నట్టుగా ఉన్నాయి. నాని ‘గ్యాంగ్ లీడర్’లోనూ కిడ్నాప్ చేసే టీమ్ మెంబర్ గా ప్రియాంక నటించింది, ఇందులోనూ అదే తరహా పాత్రను పోషించింది. హీరోయిన్ మేనకోడలే కిడ్నాప్ కావడంతో హీరోకు, ఆమెకు మధ్య రొమాన్స్ ను క్రియేట్ చేయడానికి ఆస్కారం లేకపోయింది. పైగా సినిమా ప్రారంభంలోనే హీరోతో ఆమె మానసికంగా కటీఫ్ అయిపోతుంది. దాంతో ఓ చక్కటి పాటను చివరిలో వేశారు. కానీ అప్పటికీ సహనం కోల్పోయిన ప్రేక్షకులు సీట్ లోంచి లేచి బయటకు వెళ్ళిపోతున్నారు.
నిజం చెప్పాలంటే ఈ సినిమాలో కామెడీకి లోటు లేదు. యోగిబాబుతో పాటు రెడిన్ కింగ్ల్సే తమ నటనతో బాగా నవ్వించారు. అంతేకాదు గోవాకు బయలుదేరే టీమ్ మెంబర్స్ తో పాటు, హీరోయిన్ ఇంటి సభ్యులూ డైలాగ్ కామెడీతో ఆకట్టున్నారు. చాలా రోజుల తర్వాత ‘వాన’ ఫేమ్ వినయ్ రాయ్ ను విలన్ పాత్రలో చూసే ఛాన్స్ దక్కింది. మిలింద్ సోమన్ వంటి చక్కని ఆర్టిస్టును దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. ట్విన్ బ్రదర్స్ రఘురామ్, రాజీవ్ లక్ష్మణ్ పోరాట సన్నివేశాలలో కాస్తంత మెప్పించారు. ఈ సినిమాకు అనిరుధ్ నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ. అలానే విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు కోటపాడి రాజేశ్, మహేశ్వరరెడ్డి తీసుకొచ్చారు. వినోదాత్మక చిత్రాలను ఇష్టపడేవారికి ఓ మాదిరిగా ‘వరుణ్ డాక్టర్’ నచ్చే ఆస్కారం ఉంది. కానీ ఇదేదో యాక్షన్ డ్రామా అనుకుని వెళితే మాత్రం నిరాశకు గురికాక తప్పదు.
ప్లస్ పాయింట్స్
ఆకట్టుకునే వినోదం
అనిరుధ్ నేపథ్య సంగీతం
విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ
మైనెస్ పాయింట్స్
ఆకట్టుకోని కథనం
నిరాశ పరిచే క్లయిమాక్స్
రేటింగ్ : 2.25 / 5
ట్యాగ్ లైన్: నవ్వులపాలైన డాక్టర్!
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!