వింత ఆచారం..అక్కడ కాలితో తంతే కష్టాలు ఖతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనదేశంలో విభిన్న మతాలు, ఎన్నో ఆచారాలు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో వింత ఆచారం వుంది. అక్కడ కాలితో తంతే కష్టాలు వుండవట. సమస్యలు ఎన్నైనా పరిష్కారం ఒక్కటే. అదే ఒకే ఒక్క కాలి దెబ్బకి కష్టాలు మాయం అవుతాయి. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెద్దహుల్తి గ్రామానికి వెల్లసిందే….దీపావళి వెళ్ళిన మూడు రోజుల తర్వాత హుల్తిలింగేశ్వర స్వామి పండుగ జరుగుతుంది. ప్రతి సంవత్సరం కార్తీకమాసం రెండవరోజు పెద్దహుల్తి గ్రామంలో హుల్తిలింగేశ్వర స్వామి ఉత్సవాలు జరుగుతాయి. హుల్తిలింగేశ్వర ఉత్సవమూర్తి విగ్రహాన్ని మోసుకు వస్తారు. స్వామిని ఆవహించిన వ్యక్తి చేతిలో ఖడ్గం, విగ్రహం తలపై మోసుకుని గ్రామంలో ఊరేగింపుగా గుడి దగ్గరికి వస్తారు. స్వామి ఊరేగింపుగా అక్కడికి రాగానే అప్పటికే స్వామి భక్తులు తమ కష్టాలను తీర్చుకునేందుకు వరుస క్రమంలో బోర్లా పడుకొని ఉంటారు భక్తులు.
ఉద్యోగం రాని వారు ,సంతానం లేని వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, అప్పులు ఉన్నవారు, ఇలా ఒక్కటి కాదు సమస్యలు ఉన్నవారు బోర్లా పడుకుంటారు. హుల్తిలింగేశ్వర స్వామి అవహించిన వ్యక్తి వారిని కాలుతో తన్ని భక్తుల సమస్యను విని పూలు, బండారు భక్తులకు ఇచ్చి ఆశీర్వదిస్తాడు స్వామి. కాలితో తన్నిన తరువాత వారి కష్టాలు తీరతాయి. సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం రాని వారికి ఉద్యోగం, ఇలా అన్ని సమస్యలు చిటికెలో తీరిపోతాయని భక్తుల నమ్మకం.
Also Read
- Saayoni Ghosh: పార్లమెంట్‌ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
- Cockroach Party: మరో దేశానికి పొంచి ఉన్న ‘కాక్రోచ్’ ముప్పు.. అవినీతిపై ఢిల్లీ తరహాలో కసరత్తు
- El Nino Alert: ఐఎండీ అలర్ట్.. ఆగస్టులో తక్కువ వర్షాలుంటాయని హెచ్చరిక
- Delhi: ఐబీ ఉద్యోగి అంకిత్ శర్మ హత్య కేసులో సంచలన తీర్పు.. మాజీ ఆప్ నేత తాహిర్ హుస్సేన్‌కు జీవిత ఖైదు
ఈ వింత ఆచారం చూడడానికి భక్తులు భారీగా తరలివస్తారు. ఈ కంప్యూటర్ యూగంలో కూడా ఇలాంటి మూఢ నమ్మకాలు ఆచరించడం విశేషం. అయితే ఇక్కడ కేవలం నిరక్షరాస్యత లేని వాళ్లు మాత్రమే ఈ బోర్లాపడుకుని తన్నించుకుంటున్నారు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఉన్నత చదువులు చదువు కున్న వారు కూడా ఉద్యోగం కోసం ఇలా కాలితో తన్నించుకుంటారు.
తాజావార్తలు
-
Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
-
Andhra Pradesh: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 44.89 లక్షల మంది ఆచూకీ లేని ఓటర్లు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్.. SIR గడువు మరోసారి పొడిగింపు.!
-
Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
-
Saayoni Ghosh: పార్లమెంట్‌ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!