ఉత్తరభారతంలో మెల్లిగా ఎన్నికల వేడి రగులుకుంటోంది. వచ్చే ఏడాది 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నది. పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తకుండా ఉండేందుకు ఈ ఐదేళ్ల కాలంలో మూడు సార్లు ముఖ్యమంత్రులను మార్చింది. గతంలో బీజేపీలో ఉండి ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరిన నేతలను తిరిగి బీజేపీలో చేరే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. పురోలా నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఈరోజు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఐదేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరినట్టు రాజ్‌కుమార్ పేర్కొన్నారు. 2007 నుంచి 2012 వరకు రాజ్‌కుమార్ బీజేపీలోనే కొనసాగారు. అయితే, 2012లో టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. 2017లో జరిగిన ఎన్నికల్లో పురోలా నియోజక వర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌పార్టీకి షాక్: బీజేపీలోకి కాంగ్రెస్ నేతలు…
