యూపీలో పోటీకి శివ‌సేన సై…

ఉత్త‌ర ప్ర‌దేశ్ అసెంబ్లీకి వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  మొత్తం 403 అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల్లో 100 చోట్ల పోటీ చేసేందుకు శివ‌సేన సిద్దంగా ఉన్న‌ట్టు స‌మాచారం.  ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హారాష్ట్ర‌కు ప‌రిమిత‌మైన శివ‌సేన పార్టీని విస్త‌రించుకోవ‌డానికి సిద్ధం అవుతున్న‌ది.  ఇందులో భాగంగానే యూపీలో ప‌శ్చిమ భాగం నుంచి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్న‌ది.  యూపీ ప‌శ్చిమ రైతులు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, త‌ప్ప‌కుండా పోటీ చేసి త‌మ ప్ర‌భావం చూపుతామ‌ని శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ పేర్కొన్నారు.  అదే విధంగా గోవా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా పోటీ చేసేందుకు కూడా సిద్దంగా ఉన్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.  గోవాలోని 40 సీట్ల‌కు గాను 20 చోట్ల నుంచి పోటీ చేస్తామ‌ని అంటున్నారు.  మ‌హారాష్ట్ర త‌ర‌హాలోనే మ‌హా వికాస్ అఘాడీ కోసం ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని సంజ‌య్ రౌత్ పేర్కొన్నారు.  

Read: గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా భూపేంద్ర‌భాయ్ ప‌టేల్‌…

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-