NTV Telugu Site icon

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ కు విలన్ గా స్టార్ హీరో.. హరీష్ శంకర్ ప్లాన్ మాములుగా లేదు..

Ustaad

Ustaad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకేక్కుతున్న భారీ బడ్జెడ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరగనున్న షూటింగ్ లో పవన్ తో కొన్ని కీలక సీన్స్ ను తెరకేక్కిస్తున్నారు.. ఆ తర్వాత పవన్ లేకుండా షూటింగ్ జరగనుందని టాక్.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ని సరికొత్తగా మాస్ క్యారెక్టర్‌లో చూపిస్తారని ఆశిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో పవన్ ఎదుర్కోబోయే విలన్ కూడా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు సమాచారం.

అఫీషియల్ గా చిత్రం టీమ్​ కూడా ఎటువంటి హింట్ ఇవ్వకపోయినా విలన్​ రోల్​లో ఎవరు కనిపించబోతున్నారో దాదాపు​ ఖరారు అయినట్లుగా సమాచారం.. అతను ఎవరో కాదు.. తమిళ డైరెక్టర్ కమ్​ యాక్టర్​ ఆర్ పార్తీబన్​. ఆయన్ను విలన్ పాత్రలో డిఫరెంట్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. తమిళంలో పార్ధీపన్ దర్శకుడిగా, నటుడిగా మూడు దశాబ్దాల నుంచి కెరీర్​లో రాణిస్తున్నారు. అయితే తెలుగులో ఈయన చేసినవి తక్కువే. అప్పట్లో రామ్ చరణ్ నటించిన రచ్చ చిత్రంలో ఫ్లాష్‌ బ్యాక్‌లో రామ్‌చరణ్‌ ఫాదర్‌గా చేసిన సూర్యనారాయణే ఈయనే…

ఈ సినిమా విజయ్, అట్లీ కాంబోలో వచ్చిన ‘తెరి’కి రీమేక్ అని ప్రచారం జరిగింది. దీనిపై దర్శకుడు హరీశ్​ను క్లారిటీ ఇవ్వటానికి ఇష్టపడలేదు.. రీసెంట్‌గా వచ్చిన టీజర్ చూస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది అని అన్నారు.. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో శ్రీలీల కనిపించనుంది. మరో హీరోయిన్‌గా అఖిల్ సరసన ఏజెంట్ సినిమాలో నటించిన సాక్షి వైద్య కనిపించనుంది.పోలీస్ డ్రామాగా ఈసినిమా కథ గా రూపొందుతుంది..ఇక ఈ సినిమాకు రాక్ ​ స్టార్​ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు..