అమెరికా రక్షణశాఖకు సంబంధించిన అత్యంత కీలకమైన రహస్యాలను లీక్ చేసిన 21 ఏళ్ల యువకుడిని FBI అరెస్టు చేసింది. అమెరికా నిఘా పత్రాల లీక్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ డేటాతో కూడిన అమెరికా నిఘా సంస్థ రహస్య పత్రాలు గత వారం ఇంటర్నెట్‌లో లీక్ చేయబడి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. ఆ పత్రాలు ఉక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించిన సున్నితమైన సైనిక సమాచారాన్ని వెల్లడించాయి. మిలిటరీ ఇంటెలిజెన్స్ పత్రాల లీక్ కేసులో 21 ఏళ్ల నిందితుడిని ఎఫ్‌బిఐ ఈ రోజు అరెస్టు చేసింది. నిందితుడు మస్సాచుసెట్స్‌కు చెందిన డగ్లస్ టీక్సీగా గుర్తించారు.
Also Read:Pharmacy Employ Typing : అమ్మో అదేం టైపింగ్ రా బాబు.. కీ బోర్డ్ ను గడగడలాడించిన ఫార్మసీ ఎంప్లాయ్
నిందితుడిపై గూఢచర్యం నేరం మోపారు. ఇంటెలిజెన్స్ పత్రాల లీక్ బహిరంగంగా జరిగిన వారం తర్వాత అరెస్టు జరిగింది.ఎయిర్ నేషనల్ గార్డ్ ఇంటెలిజెన్స్ విభాగంలో నిందితుడు జాక్ పనిచేస్తున్నాడు. 2019లో జాక్ ఉద్యోగంలో చేరాడు. పశ్చిమ కేప్‌కోడ్‌లోని ఒటిస్ నేషనల్ ఎయిర్‌గార్డ్స్ కార్యాలయంలో సైబర్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ జర్నీమన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. జాక్ పనిచేసే ఇంటెలిజెన్స్ విభాగం అత్యంత కీలకమైంది.
Also Read: CM YS Jagan: బహుముఖ ప్రజ్ఞాశాలి అంబేద్కర్.. దేశం గర్వించదగ్గ మేధావి
అమెరికా సైన్యంలో అత్యంత రహస్య ఆపరేషన్లకు వెళ్లే బృందాలకు ఈ బృందం సాయంగా ఉంటుంది. అంతేకాదు నాటోలో ఉన్న జనరల్స్, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెరికన్ బ్యూరోక్రాట్లకు అవసరమైన సహకారం అందిస్తుంది. దీంతో ఇక్కడ పనిచేసేవారికి అమెరికాలోని అత్యంత రహస్య పత్రాలను చూసే అవకాశం ఉంటుంది. వీటిల్లో మ్యాప్‌లు, కీలక పత్రాలు వంటి ఉంటాయి. ఒక రక్షణ అధికారి మాట్లాడుతూ మిలిటరీ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయడానికి, రక్షించే బాధ్యతను కలిగి ఉంటాడని అందువల్ల అతనికి అధిక స్థాయి భద్రతా క్లియరెన్స్ ఉండేదని చెప్పారు. కాగా, 2010లో వికీలీక్స్ వివాదం తర్వాత 700,000 డాక్యుమెంట్లు, దౌత్యపరమైన వీడియోలు వెబ్‌సైట్‌లో కనిపించినప్పటి నుండి ఈ రహస్య నివేదికల లీక్‌ల యొక్క ఇటీవలి కేసు అత్యంత తీవ్రమైన భద్రతా ఉల్లంఘనగా పరిగణించబడింది.
