Site icon NTV Telugu

పంజాబ్ రాజ‌కీయం: కాంగ్రెస్‌పై యూపీఏ కూటమిపార్టీల విమ‌ర్శ‌లు…

పంజాబ్‌లో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న‌ది. అమ‌రీంద‌ర్ సింగ్ రాజీనామాతో ఆ రాష్ట్రంలో నెక్ట్స్ ఎవ‌రు అధికారం చేప‌డ‌తారు అన్న‌తి ఆస‌క్తిక‌రంగా మారింది.  రాజీనామా చేసిన త‌రువాత అమ‌రీంద‌ర్ సింగ్ డైరెక్ట్‌గా సిద్ధూను విమ‌ర్శించారు.  పాక్ కు పంజాబ్ ఆయుధంగా మారొచ్చ‌ని చెప్ప‌డంతో రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది.  ఇక పంజాబ్ రాజ‌కీయాల‌పై యూపీఏ కూట‌మిలోని పార్టీలు ప‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి.  బీజేపీపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంద‌ని అనుకోవ‌డం అత్యాశే అవుతుంద‌ని నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ ఉపాధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి ఒమ‌ర్ అబ్ధుల్లా పేర్కొన్నారు.  రాష్ట్రాల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేత‌లు అంత‌ర్గ‌త క‌ల‌హాల‌కు దిగుతున్నార‌ని, దాని ప్ర‌భావం యూపీఏ కూట‌మిలోని మిగ‌తా పార్టీల‌పై ప‌డుతుంద‌ని అన్నారు.  రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీని ఓడించేందుకు బీజేపీ వ్య‌తిరేక పార్టీల‌ను ఏక‌తాటిపైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్న స‌మ‌యంలో ఇలాంటి అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు బ‌య‌ట‌ప‌డ‌టం బీజేపీకి ప్ల‌స్ అవుతుంద‌ని యూపీఏ నేతలు చెబుతున్నారు.  

Read: నిర్ల‌క్ష్యం: ఆ వృద్ధురాలికి అర‌గంట‌లో రెండు డోసులు…

Exit mobile version