Site icon NTV Telugu

మళ్లీ కరోనా కల్లోలం.. ఆ రాష్ట్రాలకు కేంద్రం లేఖ

భారత్‌లో మళ్లీ కరోనా కల్లోలం సృష్టిస్తోంది.. ఓవైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ టెన్షన్‌ పెడుతుంటే.. మరోవైపు.. కోవిడ్‌ కేసులు కూడా అమాంతం పెరిగిపోయాయి.. గత వారం వరకు 7వేల లోపు నమోదవుతూ వచ్చిన రోజువారి పాజిటివ్‌ కేసుల సంఖ్య.. మళ్లీ పది వేలు దాటి 15 వేల వైపు పరుగులు పెడుతోంది… తాజాగా దేశవ్యాప్తంగా 13,154 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. 268 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇక, ఒమిక్రాన్‌ కేసులు కూడా వెయ్యికి చేరువగా వెళ్తున్నాయి.. ఈ నేపథ్యంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు..

Read Also: జనవరి 2 వరకు ఆంక్షలు.. డీజీపీ కీలక ఆదేశాలు

తాజాగా ఎక్కువ కేసులు వెలుగు చూస్తున్న ఢిల్లీ, హర్యానా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, జార్ఖండ్‌ రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్ర ఆరోగ్యశాఖ.. కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచాలని ఆదేశాలు జారీ చేసింది.. కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో.. ఆస్పత్రులలో మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాలని సూచించింది.. ఇక, కరోనా కట్టడిలో భాగంగా.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్.

Exit mobile version