టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి సర్జరీ జరిగింది… ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో రెస్ట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.. అయితే, మహేష్ ఆరోగ్యంపై గత కొంతకాలంగో సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసింది… మోకాలికి సర్జరీ నిమిత్తం ఆయన విదేశాలకు వెళ్తారని ప్రచారం సాగింది.. తన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ సమయంలో.. మహేష్ మోకాలికి చిన్న గాయం అయినట్టుగా తెలుస్తోంది.. తీవ్రమైన నొప్పితో బాధపడుతోన్న మహేష్.. వైద్యులను సంప్రదించగా.. సర్జరీ అవసరమని సలహా ఇచ్చారట.. దీంతో.. స్పెయిన్ వెళ్లిన సూపర్ స్టార్ మహేష్.. మోకాలికి సర్జరీ చేయించుకున్నారు.. ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
Read Also: ఇక గేమ్ స్టార్ట్.. వచ్చే ఎన్నికల్లో గెలిచే వ్యూహంలోనే ఉంటాం..!
కాగా, పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ షూటింగ్‌కు బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది.. సర్జరీ చేయించుకున్న మహేష్‌బాబు.. పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ షూటింగ్ మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చిందట.. అందుకే షూటింగ్‌ను ఏకంగా రెండు నెలల పాటు వాయిదా వేసినట్టుగా ప్రచారం సాగుతోంది.. మరోవైపు.. ఈ విషయం తెలిసి అభిమానులు.. తమ అభిమాన నటుడు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసుకుని పూర్తి ఆరోగ్యవంతుడిగా తిరిగి రావాలని.. త్వరలోనే షూటింగ్‌లో పాల్గొనాలని పోస్టులు పెడుతున్నారు.
