Site icon NTV Telugu

మదురైలో కుప్పకూలిన ఫ్లైఓవర్..

మదురైలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కుప్పకూలింది.. దాదాపు నగరంలో ఏడు కిలోమీటర్ల వరకు ప్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి… అయితే, ఇవాళ అకస్మాత్తుగా ఐదువందల మీటర్ల మేర ఫ్లైఓవర్‌ కూలిపోయింది… ప్రమాద సమయంలో ఫ్లైఓవర్‌ కింద పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనదారులు, నిర్మాణ పనుల్లో ఉన్న సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తోంది.. భారీ క్రేన్ సహాయంతో శిథిలాలను తొలగింపు ప్రయక్రియ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందినట్టుగా మరో నలుగురు తీవ్ర గాయాలపాలైనట్టుగా చెబుతున్నారు అధికారులు.. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…

Exit mobile version