Site icon NTV Telugu

ఇండియా పాక్‌ మ్యాచ్‌కు వంద టికెట్లు ఫ్రీగా ఇచ్చిన వ్యాపార‌వేత్త‌…

ఈనెల 24 వ తేదీన ఇండియా పాక్ మ‌ధ్య టీ20 వ‌రల్డ్ క‌ప్ మ్యాచ్ జ‌ర‌గ‌బోతున్న‌ది.  ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు కేవ‌లం గంట వ్య‌వ‌ధిలోనే అమ్ముడుపోయిన సంగ‌తి తెలిసిందే.  ఈ మ్యాచ్ కోసం ప్ర‌పంచం మొత్తం ఆతృత‌గా ఎదురుచూస్తున్న‌ది.  దుబాయ్ వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ది.  యూఏఈకి చెందిన అనీస్ సాజ‌న్ అనే వ్యాపార‌వేత్త త‌న ద‌నుబే కంపెనీలో ప‌నిచేస్తున్న బ్లూకాల‌ర్ ఉద్యోగుల‌కు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ కింద ఇండియా -పాక్ మ్యాచ్ టికెట్ల‌ను అంద‌జేశారు.  ఇండో పాక్ మ్యాచ్ ను ఉద్యోగులు ఎంజాయ్ చేయాల‌నే ఉద్దేశంతో ఈ టికెట్లు ఇస్తున్న‌ట్టు సాజ‌న్ తెలియ‌జేశారు.  పాక్-ఆఫ్ఘ‌నిస్తాన్‌, ఇండియా వ‌ర్సెస్ ఏ2 క్వాలిఫైయ‌ర్ మ్యాచ్ టికెట్ల‌ను కూడా ఉద్యోగుల‌కు ఇస్తున్న‌ట్టు సాజ‌న్ తెలిపారు.  

Read: ఆ దేశాన్ని భ‌య‌పెడుతున్న అగ్నిప‌ర్వ‌తం…

Exit mobile version