Site icon NTV Telugu

కాంగ్రెస్‌ పార్టీ నేతలకు షాకిచ్చిన ట్విట్టర్..

Twitter

Twitter

ఆ మధ్య వరుసగా కేంద్ర మంత్రులు, బీజేపీ టాప్‌ లీడర్లకు షాకిచ్చిన సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌.. ఇప్పుడు ఫోకస్‌ కాంగ్రెస్‌ నేతలపై పెట్టినట్టు కనిపిస్తోంది.. ఎందుకంటే.. మొన్నటి మొన్న రాహుల్‌ గాంధీ ఖాతాను లాక్‌ చేసిన ట్విట్టర్‌.. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అధికారిక ట్విట్టర్‌ ఖాతాను.. ఆ పార్టీకి చెందిన మరో ఐదుగురు నేతల అకౌంట్లను నిలిపివేసింది.. కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అజయ్‌ మాకెన్‌, లోక్‌సభలో ఆ పార్టీ విప్‌ మాణిక్కం ఠాగూర్‌, అసోం ఇన్‌చార్జి, మాజీ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌, కాంగ్రెస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితాదేవ్‌ ఖాతాలను లాక్‌ చేసింది ట్విట్టర్‌… ఈ విషయాన్ని ప్రణవ్‌ ఝా ట్విట్టర్‌ సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు.. అయితే, వరుసగా తమ పార్టీ నేతల ఖాతాలను నిలిపివేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్… ట్విట్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిరసన తెలపడం, ప్రతి ఒక్కరి కోసం పోరాటం చేయడాన్ని కూడా తప్పుగా చూస్తున్నారని మండిపడుతున్నారు కాంగ్రెస్‌ నేతలు.

Exit mobile version