NTV Telugu Site icon

Twitter: ట్విట్టర్ మరో నిర్ణయం..’w’ అక్షరం తొలగింపు!

Twitter

Twitter

ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ ప్రధాన కార్యాలయం ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో‌లో ట్విట్టర్ పేరులో గల ‘w’ అక్షరం తొలగించారు. ట్విట్టర్ శాన్ ఫ్రాన్సిస్కోలోని కంపెనీ ప్రధాన కార్యాలయం వెలుపల సైన్ బోర్డుపై ‘w’ అక్షరాన్ని కవర్ చేసింది. ట్విట్టర్ దాని ఐకానిక్ బ్లూ బర్డ్ లోగోను డాగ్‌కోయిన్ తో మార్చారు. ట్విట్టర్ పిట్టను మార్చి డాగ్ పెట్టడంతో విమర్శలు వచ్చాయి. గత ఏడాది ఏప్రిల్‌లో, Twitter CEO ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో ‘w’ని తొలగించాలా వద్దా అని వినియోగదారులను అడిగారు. ట్విట్టర్‌కు మరో పేరు సూచించాలని మస్క్ పోల్ పెట్టారు.
Also Read:RGI Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాల రద్దు.. ఆందోళనలో ప్రయాణికులు

ఇటీవల ట్విట్టర్ లోగోలో ఉన్న పిట్ట బొమ్మను తీసివేశారు. ఆ ప్లేస్‌లో కుక్క బొమ్మ పెట్టారు. ఏమైందో ఏమో రెండు రోజులకు మళ్లీ పిట్ట బొమ్మ పెట్టారు. ఇప్పుడు ట్విట్టర్‌ అక్షరంలో డబ్ల్యు(w) అనే పదేం తీసివేశారు. దీంతో దానిని పేరును టిట్టర్‌గా పిలువాల్సి ఉంటుంది. దీనిపై కూడా సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇది పిల్లల ఆట మాదిరిగా ఉందని కొందరు మండిపడుతున్నారు.

Show comments