Site icon NTV Telugu

వైర‌ల్‌: సింహాన్ని బెద‌ర‌గొట్టిన తాబేలు…

సింహం అడవికి రారాజు.  అందులో ఎలాంటి సందేహం అవ‌స‌రం లేదు.  అలాంటి సింహాన్ని బెదిరించాలి అంటే సింహం కంటే బ‌ల‌మైన జంతువు అయి ఉండాలి.   అయితే, ఓ చిన్న తాబేలు అడ‌వికి రాజైన సింహాన్ని బెదిరించింది.  త‌న త‌ల‌ను పైకి ఎత్తి సింహంపైకి దూసుకెళ్లింది.  దీంతో సింహం నాకెందుకులే అన్న‌ట్టుగా ప‌క్క‌కు జ‌రిగి మ‌ళ్లీ నీళ్లు తాగ‌డం మొద‌లుపెట్టింది.  అయిన‌ప్ప‌టికి ఆ తాబేలు ఊరుకోలేదు.  సింహం మీద‌కు మ‌ళ్లీ త‌ల‌ను పైకి ఎత్తి అక్క‌డి నుంచి వెళ్లిపో అన్న‌ట్టుగా హెచ్చ‌రించింది.  తాబేలు హెచ్చ‌రిక‌కు భ‌య‌ప‌డిన సింహం స‌గం నీటితోనే క‌డుపు నింపుకొని వెళ్లిపోయింది.  దీనిని సంబందించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది

Read: త‌ప్పుడు హెయిర్ క‌ట్ ఫ‌లితం: మోడ‌ల్‌కు రూ.2 కోట్ల ప‌రిహారం…

Exit mobile version