Site icon NTV Telugu

హాట్ కేకుల్లా టీటీడీ సర్వదర్శనం టోకెన్లు..

ఏడుకొండల వేంకటేశ్వర స్వామివారిని దర్శించేందుకు ఎక్కడెక్కడినుంచే భక్తులు వస్తుంటారు. అయితే కరోనా నేపథ్యంలో శ్రీవారి దర్శానానికి ఆన్‌లైన్‌లో టికెట్లను టీటీడీ విడుదల చేస్తోంది. అయితే తాజాగా జనవరి నెలకు సంబంధించిన టికెట్లను టీటీడీ ఈ రోజు ఉదయం 9 గంటలు విడుల చేసింది.

అయితే హాట్ కేకుల్లా సర్వదర్శనం టోకెన్లు బుక్కాయ్యాయి. జనవరి నెలకు సంబంధించి 2.60 లక్షల టోకెన్లను టీటీడీ విడుదల చేసింది. అయితే విడుదల చేసిన 15 నిమిషాల వ్యవధిలోనే మొత్తం టొకెన్లు అన్ని బుక్కాయ్యాయి. అయితే 15 నిమిషాలకే పూర్తిగా టోకెన్లు బుక్‌ అవడంతో అది తెలియని వేలాది భక్తులు ఇప్పటికీ లాగిన్‌ అవుతున్నారు.

Exit mobile version