తెలంగాణ ఎంసెట్ పరీక్షకు ఇప్పటి వరకు దరఖాస్తు చేయని విధ్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది కెసిఆర్ సర్కార్. తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు గడువు ఈ నెల 26 వరకు పెంచింది ప్రభుత్వం. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. ఇక ఇప్పటికే లక్ష 50 వేలు దాటాయి తెలంగాణ ఎంసెట్ దరఖాస్తులు. ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో లక్షా 6 వేల 506 దరఖాస్తులు రాగా.. అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ లో 50 వేల 20 అప్లికేషన్లు వచ్చాయి. ఇక ఈ రోజు వరకు మొత్తం దరఖాస్తులు లక్ష 56 వేల 526 దరఖాస్తులు వచ్చాయి. మార్చి 20న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయింది. ఇది ఇలా ఉండగా.. కరోనా నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో పది, ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు రద్దు కాగా.. సెకండ్ ఇయర్ పరీక్షలు వాయిదా పడ్డాయి.
అలర్ట్ : తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు గడువు
