తెలంగాణలో ఎమ్మెల్సీ కోటాలో ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. తకెళ్ల పల్లి రవీందర్, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, బండ ప్రకాష్ పేర్లను పార్టీ ఖరారు చేసింది. అభ్యర్థులుగా ఖరారైన ఆరుగురు కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్‌కు చేరుకున్నారు.
Read: షాకింగ్ ఫ్యాక్ట్స్: రాబోయే ఐదేళ్లలో రూ.37 లక్షల కోట్ల ఆన్‌లైన్ వ్యాపారం…
కాసేపట్లో ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేస్తున్న బండ ప్రకాష్ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఈటలకు కౌంటర్‌గా బండ ప్రకాష్‌కు ఎమ్మెల్సీ ఇవ్వనున్నారని సమాచారం. ఎమ్మెల్సీగా ఎంపికయ్యాక బండ ప్రకాష్‌కు కేబినెట్‌లో స్థానం దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం.