షాకింగ్ ఫ్యాక్ట్స్‌: రాబోయే ఐదేళ్ల‌లో రూ.37 ల‌క్ష‌ల కోట్ల ఆన్‌లైన్ వ్యాపారం…

ఇంటర్నెట్ అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత ఈ కామ‌ర్స్ రంగం వేగంగా అభివృద్ది చెందుతున్న‌ది.  ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేసేవారి సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతున్న‌ది.  ప్ర‌పంచంలో రెండో అతిపెద్ద జ‌నాభా క‌లిగిన దేశ‌మైన ఇండియాలోని ప్ర‌జ‌లు ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.  మ‌న దేశంలో ప్ర‌తి ఏడాది అనేక పండుగ‌లు, స్పెష‌ల్ ఫెస్టివ‌ల్స్ వ‌స్తుంటాయి. ఆయా రోజుల్లో పండుగ‌ల ఆఫ‌ర్ కింద ఈ కామ‌ర్స్ సంస్థ‌లు డిస్కౌంట్‌, క్యాష్ బ్యాక్ వంటి ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తుంటాయి.  దీంతో ఆయా రోజుల్లో వ్యాపారం మ‌రింత జోరుగా సాగుతుంది.  ఆన్‌లైన్ వ్యాపారంపై రెడ్‌సీర్ అనే సంస్థ ఓ స‌ర్వేను నిర్వ‌హించింది.  ఈ స‌ర్వేలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

Read: వైర‌ల్‌: మొస‌లిని చెప్పుతో బెద‌ర‌గొట్టిన మ‌హిళ‌…సాహ‌సానికి నెటిజ‌న్లు ఫిదా…

రాబోయే ఐదేళ్ల‌లో ఆన్‌లైన్ వ్యాపారం రూ.37 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకుంటుంద‌ని స‌ర్వేలో తేలింది.  రాబోయే ఐదేండ్ల‌లో దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో 2.4 కోట్ల కుటుంబాలు ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేస్తార‌ని అంచ‌నా వేస్తున్నారు.  ప్ర‌స్తుతం ఒక్కో కుటుంబం ఆన్‌లైన్ షాపింగ్ కోసం స‌గ‌టున 13 నుంచి 14 వేల డాల‌ర్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని, 2026 నాటికి ఒక్కోకుటుంబం 19 నుంచి 20 వేల డాల‌ర్లు ఖ‌ర్చుచేస్తార‌ని స‌ర్వేలో తేలింది. 

Related Articles

Latest Articles