ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఆర్టీసీ బలోపేతంపై దృష్టిసారించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఈ మధ్యే టీఎస్ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్‌ను నియమించారు.. ఆయన క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఆర్టీసీ పరిస్థితిపై అధ్యయనం మొదలు పెట్టారు.. ఇక, ఇవాళ ఆర్టీసీ చైర్మన్‌గా సీనియర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డిని నియమించారు సీఎం కేసీఆర్.. ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి.. సుదీర్ఘ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని.. కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
సీనియప్ రాజకీయనేతగానే కాదు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కీలక నేతగా ఉన్నారు బాజిరెడ్డి.. 1999 నుండి 2004 వరకు ఆర్మూర్ నియోజకవర్గం నుంచి.. 2004 నుండి 2009 వరకు బాన్సువాడ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన ఆయన.. దివంగతనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత.. వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఇక, 2014 ఎన్నికలకు ముందు వైసీపీకి గుడ్‌బై చెప్పిన బాజిరెడ్డి.. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.. నిజామాబాద్ నుండి పోటీచేసి డీఎస్‌పై విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో కూడ అదే స్థానం నుండి పోటీ చేసి మరోసారి గెలుపొందారు.. ఆయన సుదీర్ఘ అనుభవం.. ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల బాట పట్టిస్తుందన్న నమ్మకంతో.. కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ఇప్పుడు.. వీసీ సజ్జనార్, బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి.. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తారే చూడాలి మరి.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!