NTV Telugu Site icon

టీఆర్‌ఎస్‌ కోల్డ్‌వార్‌.. మంత్రి ముందే నేతల బాహాబాహీ

టీఆర్‌ఎస్‌లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. వికారాబాద్‌ జిల్లా తాండూరులో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలోనే టీఆర్‌ఎస్‌ నేతలు మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారికి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గాల మధ్య గత కొన్ని రోజుల నుంచి కోల్డ్ వార్‌ నడుస్తోంది. ఈ విషయం స్థానిక నేతలకు తెలిసినా వారి మధ్య సంది కుదిర్చేందుకు సహాసించలేదు.

అయితే నేడు సబితా ఇంద్రారెడ్డి ముందే ఇరు వర్గాల నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. దీంతో వెంటనే స్పందించిన మంత్రి సబిత ఇరువర్గాల నేతలను సముదాయించారు. అయితే టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషి చేసే దిశగా కేసీఆర్‌ అడుగులు వేస్తుంటే.. పార్టీలోనే నేతలే ఇలా వర్గపోరుకు దిగితే ఎలా..? అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.