Site icon NTV Telugu

టీఆర్ఎస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌…

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు.  ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఈ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు.  ఈరోజు నుంచి నామినేష‌న్ల స్వీక‌రణ ఉంటుంది.  ఈరోజు ఉద‌యం 11 గంట‌ల నుంచి 22 వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు ఎన్నిక‌ల నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తారు.  ఆ త‌రువాత, అక్టోబ‌ర్ 25 వ తేదీన ఎన్నిక‌లు నిర్వహిస్తారు.  అదే రోజున రాష్ట్ర అధ్య‌క్షుడి ఎంపిక ఉంటుంది.  ఎంపిక అనంత‌రం, ప్లీన‌రీని నిర్వ‌హిస్తారు.  ఈ ప్లీన‌రీకి 13 వేల మందికి పైగా ప్ర‌తినిధులు హాజ‌ర‌వుతార‌ని పార్టీ ప్ర‌క‌టించింది.  హైటెక్స్‌లో ఈ ఎన్నిక‌ల నిర్వ‌హాణ‌, ప్లీన‌రీ ఉంటుంది.  

Read: భారీ ధరకు “అఖండ” రైట్స్ సొంతం చేసుకున్న దిల్ రాజు

Exit mobile version