భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మీసేవా నిర్వాహకుడు రామకృష్ణ ఆత్మహత్య ఘటన చర్చనీయాంశంగా మారింది. ఆస్తి వివాదాల కారణంగా భార్యా పిల్లలతో సహా రామకృష్ణ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మీ సేవా నిర్వాహకుడు రామకృష్ణతో పాటు అతడి భార్య లక్ష్మీ, కూతూరు సాహిత్య సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో రామకృష్ణ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు.
Read Also: శ్రీహరికోటలో కరోనా కలకలం… 14 మందికి పాజిటివ్
ఈ సందర్భంగా సూసైడ్ నోట్‌లో ఆశ్చర్యం కలిగించే విషయం వెలుగు చూసింది. మీ సేవా నిర్వాహకుడు రామకృష్ణ తన చావుకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం వనమా రాఘవేంద్రరావు పరారీలో ఉన్నట్లు సమాచారం అందుకోవడంతో పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఏ క్షణమైనా ఎమ్మెల్యే కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేసు అవకాశాలు కనిపిస్తున్నాయి.