శ్రీహ‌రికోట‌లో క‌రోనా క‌ల‌క‌లం… 14 మందికి పాజిటివ్‌…

నెల్లూరు జిల్లాలోని శ్రీహ‌రికోట‌లో క‌రోనా క‌ల‌క‌లం రేగింది.  శ్రీహ‌రికోట స‌తీష్ ధావ‌న్ అంత‌రిక్ష కేంద్రంలో ఇద్ద‌రు వైద్యులకు, 12 మంది ఉద్యోగుల‌కు క‌రోనా సోకింది.  క‌రోనా సోకిన వారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపించారు.  మొత్తం 14 మందికి క‌రోనా సోక‌డంతో అంత‌రిక్షకేంద్రంలో ప‌నిచేస్తున్న మిగ‌తా ఉద్యోగుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.  దీనికోసం ప్ర‌త్యేక మార్గ‌ద‌ర్శకాల‌ను షార్ అధికారులు విడుద‌ల చేశారు.  బ‌యో మెట్రిక్ స్థానంలో అటెండెన్స్ రిజిస్ట‌ర్ల‌ను ఏర్పాటు చేశారు.  ఉద్యోగులు, వైద్యుల‌కు క‌రోనా సోక‌డంతో ఈనెల చివ‌రి వారంలో నిర్వ‌హించాల్సిన రీ శాట్ ఉపగ్ర‌హ ప్ర‌యోగం వాయిదా ప‌డే అవ‌కాశం ఉంది.  

Read: స‌ముద్రంలో అమ్మ‌కానికి చిన్న మేడ‌… ధ‌ర ఎంతో తెలిస్తే షాక్‌…

సెకండ్‌వేవ్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్న ఏపీ ఇప్పుడు థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొన‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ది.  ఏపీలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో క‌రోనా వైద్యానికి సంబంధించిన అన్నిరాకాల స‌దుపాయాల‌ను, మౌలిక వ‌స‌తుల‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు.  సెకండ్ వేవ్ కంటే థ‌ర్డ్ వేవ్‌లో తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంద‌ని, ఇప్ప‌టికే దేశంలో థ‌ర్డ్ వేవ్ ఎంట‌రైంద‌ని టాస్క్‌ఫోర్స్ స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే.  సెకండ్ వేవ్ స‌మ‌యంలోనూ షార్‌లోని కొంత‌మంది ఉద్యోగులు క‌రోనా బారిన ప‌డ్డారు.  అయిన‌ప్ప‌టికీ శాస్త్ర‌వేత్త‌లు అంత‌రిక్ష ప్ర‌యోగాల‌కు ఎలాంటి ఆటంకం రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.  ప్ర‌యోగాల‌కు ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు.  ఇప్పుడు మ‌ర‌లా క‌రోనా విజృంభిస్తుండ‌టంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.  

Related Articles

Latest Articles