Site icon NTV Telugu

భార‌త సైనికుల‌కు స‌రికొత్త ఆయుధాలు… చైనాకు షాకే…

ల‌ద్దాఖ్‌లోని గ‌ల్వాన్ ఘ‌ట‌న త‌రువాత భార‌త ప్ర‌భుత్వం సైనికుల కోసం అధునాత‌న‌మైన ఆయుధాల‌ను స‌మ‌కూర్చ‌డం మొద‌లు పెట్టింది.  ఇండియా చైనా బోర్డ‌ర్లో ఇరు దేశాల సైనికులు ఆయుధాల‌తో ప‌హ‌రా నిర్వ‌హించ‌కూడ‌దు అనే ఒప్పందం ఉన్న‌ది.  అయితే, ఆ ఒప్పందానికి చైనా తూట్లు పొడిచి ఈటెలు, ముళ్ల వంటి ఆయుధాల‌తో గ‌ల్వాన్‌లో భార‌త్ సైనికుల‌పై దాడి చేసింది.  అయితే, ఆ దాడిని భార‌త సైనికులు ఒంటిచేత్తో తిప్పికొట్టారు.  ఆ దాడిలో భార‌త్ 20 మంది సైనికుల‌ను కోల్పోగా, చైనా నుంచి సుమారు వంద మందికిపైగా సైనికులు మృతి చెందారు.  అనేక మంది గాయ‌ప‌డ్డారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైనా ఇండియా ఆర్మీ కోసం స‌రికొత్త ఆయుధాల‌ను త‌యారు చేసింది.  త్రిశూల్ పేరుతో త‌యారు చేసిన మొత్తం 5 ర‌కాల ఆయుధాల‌ను ఇండియ‌న్ ఆర్మీకి అప్ప‌గించింది.  

బ్యాట‌రీ స‌హాయంతో ప‌నిచేసే త్రిశూలం,  బ్యాట‌రీ స‌హాయంతో ప‌నిచేసే లోహ‌పు క‌డ్డీ వ‌జ్ర‌, విద్యుత్ ప్ర‌వాహం క‌లిగిన ప్ర‌త్యేక గ్లౌజ్‌లు, బ్యాట‌రీ స‌హాయంతో ప‌నిచేసే విద్యుత్ క‌ర్ర‌, రాళ్ల‌దాడి నుంచి కాపాడే భ‌ద్ర క‌వ‌చం.  ఈ భ‌ద్ర క‌వ‌చం నుంచి మిరుమిట్లు గొలిపే కాంతి ప్ర‌సారం అవుతుంది.  ఈ కాంతికి శ‌తృవుల క‌ళ్లు క‌నిపించ‌కుండా పోతాయి.  గ‌ల్వాన్ లోని భార‌త సైనికుల‌కు అధునాత‌న‌మైన సంప్ర‌దాయ‌క‌మైన ఆయుధాల‌ను అంద‌జేయ‌నున్నారు.  

Read: చంద్రుడిపై వైఫై… నాసా సరికొత్త ప్లాన్‌…

Exit mobile version