అప్పుడే ట్రెండ్ సృష్టిస్తున్న మహేష్ ఫ్యాన్స్…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు అప్పుడే ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మహేష్ బాబు బర్త్ డే మరో 50 రోజులు ఉందనగానే ఆయన అభిమానుల్లో ఉత్సాహం మొదలైపోయింది. ఇప్పటినుంచే బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలెట్టారు. సోషల్ మీడియాలో తాజాగా ఇండియా వ్యాప్తంగా #ReigningSSMBBdayIn50Days అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఈరోజు ట్విట్టర్ లో ఇండియా ట్రెండ్స్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో 2వ స్థానంలో #ReigningSSMBBdayIn50Days అనే హ్యాష్ ట్యాగ్ నిలవడం విశేషం. దీంతో ఆయన బర్త్ డే ను సెలెబ్రేట్ చేయడానికి తాజాగా మహేష్ బాబు బర్త్ డే సీడీపీని కూడా విడుదల చేశారు. ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు భారీ ట్వీట్లు, లైకులతో ఇలా ట్రెండ్ చేస్తున్నారంటే రానున్న రోజుల్లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.
Also Read : ఆనంద్ దేవరకొండ పెళ్లి సాంగ్ కు భారీ వ్యూస్
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ఇక మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట” చిత్రంతో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ 2022 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్టైన్మెంట్,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇటీవల దుబాయ్‌లో మొదటి షెడ్యూల్ ను ఎలాంటి అడ్డంకి లేకుండా పూర్తి చేసుకుంది చిత్రబృందం. ఆ తరువాత షెడ్యూల్ కు మాత్రం కరోనా అడ్డంకిని సృష్టించింది. ప్రస్తుతం కరోనా కేసులు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణాలో ఇప్పటికే లాక్ డౌన్ ను కూడా ఎత్తేశారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో “ఎస్ఎస్ఎంబి28” అనే చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!