2020 వ సంవత్సరానికి గాను 148 మందికి పద్మా అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అనేక మంది సామాన్యులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అందులో ఒకరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన మంజమ్మ జోగతి ఒకరు. ఈమె ట్రాన్స్‌జెండర్ విమెన్. ఫోక్ డ్యాన్సర్. ప్రసిద్ద జోగమ్మ వారసత్వానికి ప్రతినిధి. కర్ణాటక జానపద అకాడెమీకి అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి ట్రాన్స్‌జెండర్ విమెన్‌గా ప్రసిద్ధిపొందారు.
Read: తాలిబన్ తుటాలకు ఎదురొడ్డి నిలిచిన మలాలా… కొత్త జీవితంలోకి ఇలా…
ఫోక్ డ్యాన్స్ రంగంలో చేసిన కృషికిగాను అమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును బహుకరించింది. ఈ అవార్డు అందుకోవడానికి ఆమె పేరు పిలిచిన వెంటనే తనదైన శైలిలో రాష్ట్రపతి ముందుకు వచ్చిన జోగతి తన చీరకొంగుతో రాష్ట్రపతికి దిష్టితీసి వందనం సమర్పించింది. ఆమె గౌరవానికి రాష్ట్రపతి ఫిదా అయ్యారు. దర్భార్ హాల్‌లో ఉన్నవారంతా చప్పట్లతో ఆమెకు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతికి జోగతి దిష్టితీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.