NTV Telugu Site icon

పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి కరోనా

తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు.. మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. మరోవైపు ఒమిక్రాన్‌ కూడా టెన్షన్‌ పెడుతోంది.. ఇక, ఎవ్వరినీ వదిలేదు అనే తరహాలో సామాన్యులు, నేతలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పీఎంలు.. అధికారులు.. ఎవరైతే నాకేంటి అనే విధంగా.. అందరినీ టచ్ చేస్తోంది మాయదారి కరోనా.. తాజాగా, టి.పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. నిర్ధారణ పరీక్షలు చేయించగా.. పాజిటివ్‌గా తేలినట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.. ఇక, ఈ మధ్య తనను కలిసినవారు కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలని సూచించారు రేవంత్‌రెడ్డి.. మరోవైపు, కరోనా బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.