తెలంగాణలో పరిపాలన గాడి తప్పింది.. వెంటనే గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. గవర్నర్ ఢిల్లీ పర్యటనపై స్పందించిన ఆయన.. సీఎం కేసీఆర్ తన కొడుకుని సీఎం చేయలేక తప్పించుకోవడం కోసం రాజ్ భవన్‌తో గొడవ పెట్టుకుంటున్నారు అని గవర్నర్ ఢిల్లీలో చెప్పారన్నారు రేవంత్‌రెడ్డి.. గవర్నర్ మీడియాతోనే చెప్పారన్నారు.. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం జీహెచ్‌ఎంసీ గవర్నర్ పరిధి అని.. గవర్నర్‌కి సెక్షన్ 8 ప్రకారం విశేష అధికారులున్నాయి.. పరిపాలన గాడి తప్పింది కాబట్టి.. గవర్నర్ జోక్యం చేసుకోవాలన్నారు.
Read Also: Revanth Reddy: రాజ్ భవన్‌లో ఉగాది వేడుకకు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు రాలేదు..?
డ్రగ్స్ మహమ్మరిపై గవర్నర్ తమిళిసై చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్‌రెడ్డి… అధికారులు వినకపోతే కేంద్రానికి లేఖ రాయాలని సూచించిన ఆయన.. కేంద్ర అధికారులతో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు.. గవర్నర్ విచక్షణ అధికారాలను ఉపయోగించి చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్.. ఇక, గవర్నర్ గారి తల్లి భౌతికకాయాన్ని సొంత గ్రామానికి పంపేందుకు హెలికాప్టర్ ఇస్తే ఏమైంది? అని సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు.. గవర్నర్‌కి సానుభూతి చెప్పాల్సిన బాధ్యత సీఎం మీద ఉందన్న ఆయన.. బాధ్యతా రహిత్యంగా వ్యవహారం చేస్తారు అని అనుకోలేదన్నారు.. అయితే, ఇదే సమయంలో.. గవర్నర్ ప్రతీ చర్యను సమర్థించడం లేదన్నారు పీసీసీ చీఫ్.. ఇది కేసీఆర్-తమిళిసై సమస్య కాదన్న ఆయన.. సీఎం – గవర్నర్ వ్యవస్థ మధ్య ఇది సరికాదని హితవుపలికారు.. మరోవైపు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఇద్దరూ బీజేపీ నాయకులు కదా? వారికి టీఆర్‌ఎస్ ఓటేసి.. గవర్నర్ బీజేపీ కార్యకర్త అంటే ఎలా? అని నిలదీశారు.. అవసరం కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. ఇక, ఉగాది వేడుకలకు కేసీఆర్ రాలేదు అని ఫిర్యాదు చేశారు గవర్నర్.. మరి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కూడా రాలేదు.. కేసీఆర్ ఏమైనా అనుకుంటారు అని రాలేదని.. ఇది కుమ్మక్కు రాజకీయమని ఆరోపించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.
