అండమాన్‌లో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త వాయుగుండంగా బలపడి తుఫాన్‌గా మారింది. ఈ తుఫాన్‌కు జవాద్ తుఫాన్‌గా అధికారులు నామకరణం చేశారు. దీంతో ఈ జవాద్ తుఫాన్ ఎఫెక్ట్ ఉత్తరాంధ్ర, ఒడిషా రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం తీర ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
అంతేకాకుండా తుఫాన్ తీవ్రత తగ్గేవరకు విశాఖపట్నంలోని పర్యాటక కేంద్రాలను మూసివేస్తున్నట్లు, సందర్శకులు రావద్దంటూ ప్రకటించింది. అయితే ఇటీవల జవాద్ తుఫాన్ విశాఖపట్నంకు 210 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే బలహీనపడి ఒడిషావైపుకు పయనమైంది. దీంతో ఏపీ ప్రజలు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విశాఖపట్నంలోని పర్యాటల కేంద్రాలను 3 రోజుల తరువాత తిరిగి ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.