Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Tornado Harassment In America

అమెరికాలో టోర్నడోల బీభత్సం.. ఎమర్జెన్సీ ప్రకటన

Published Date :December 12, 2021 , 7:40 am
By Lakshmi Narayana
అమెరికాలో టోర్నడోల బీభత్సం.. ఎమర్జెన్సీ ప్రకటన
  • Follow Us :
  • google news
  • dailyhunt

అమెరికాలోని ఐదు రాష్ట్రాల్లో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కెంటకీ రాష్ట్రంలో 70 మంది క్యాండిల్ ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోవటంతో ఈ ఘటన జరిగినట్లుగా చెబుతున్నారు అధికారులు. కెంటకీలో మొత్తం రెండు వందల మైళ్ల నుంచి 227 మైళ్ల వరకు టోర్నడోల ప్రభావం కనిపించింది. రాష్ట్రంలోని మేఫీల్డ్‌ నగరంలో టోర్నడోల దెబ్బకు బాంబు పేలినట్లుగా అనిపించిందని చెబుతున్నారు స్థానికులు. ఇక..కెంటకీలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. తీవ్రమైన గాలులకు… కరెంటు స్తంభాలు నేలకూలాయి. వైర్లు తెగిపోయాయ్. దాదాపు మూడు లక్షల మందికి విద్యుత్ లేకుండా పోయింది. టోర్నడోల ప్రభావం తగ్గిన తర్వాత…. విద్యుత్‌ను పునరుద్ధరించే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు… టోర్నడోల దెబ్బకు ఎరిగిపడ్డాయ్.

పరిస్థితులు ఆందోళనకరంగా మారటంతో… రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే వరకు… ప్రజలెవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. కెంటకీ రాష్ట్ర చరిత్రలోనే ఇదే అత్యంత ప్రమాదకరమైన టోర్నడో అని గవర్నర్ అండీ బేషర్ తెలిపారు. అటు… మిస్సోరిలో ఒకరు మృత్యువాతపడ్డారు. కొన్ని ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంపై టోర్నడోలు విరుచుకుపడ్డాయి. 1925వ సంవత్సరంలో మిసోరిలో 219 మైళ్ల మేరకు టోర్నడోల ప్రభావం కనిపించింది. అప్పట్లో ఇక్కడ 695 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు…ఇల్లినాయిస్‌లోని అమెజాన్ గిడ్డంగిలోనూ ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం. దక్షిణ ఇల్లినాయిస్‌లోని అమెజాన్ గిడ్డంగిలో వంద మంది చిక్కుకుపోయారు. మరోవైపు.. అర్కాన్సాస్‌లోని ఓ నర్సింగ్‌ హోమ్‌లో ఇరవై మంది చిక్కుకున్నారు. వాతావరణ మార్పులతో టోర్నడోలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. టెన్నిసీలో ముగ్గురు చనిపోయారు. ఇక్కడ డిసెంబరులో టోర్నడోలు అరుదుగా ఏర్పడతాయని చెబుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • tornado
  • Tornado harassment in America
  • USA

తాజావార్తలు

  • Russia offers: భారత్‌కు అండగా రష్యా.. ఇక గ్యాస్, ముడి చమురు కష్టాలు తీరినట్లే..

  • Donald Trump: హార్ముజ్‌ను తెరుస్తాం, చమురును వెల్లువలా పారిస్తాం..

  • Sajjala Ramakrishna Reddy: రాజధాని విషయంలో మాకు స్పష్టమైన వైఖరి ఉంది.. క్లారిటీ ఇచ్చిన సజ్జల

  • CSK vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. చెపాక్‌లో గెలిచేదెవరు?

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions