NTV Telugu Site icon

Separatist: వేర్పాటువాదులపై అణిచివేత.. పంజాబ్ పోలీసులకు సిక్కుల అల్టిమేటం

Crackdown On Separatist

Crackdown On Separatist

వేర్పాటువాద బోధకుడు అమృతపాల్ సింగ్‌పై పంజాబ్ పోలీసుల చర్యలపై కొంత మంది సిక్కు పెద్దలు మండిపడుతున్నారు. అమృతపాల్ సింగ్‌పై పంజాబ్ పోలీసుల అణిచివేతపై భగవంత్ మాన్ ప్రభుత్వానికి, కేంద్రానికి వ్యతిరేకంగా అకల్ తఖ్త్ ఒక బలమైన ప్రకటనను విడుదల చేసింది. హిందూ రాష్ట్రాన్ని డిమాండ్ చేసే వారిపై ఇలాంటి చర్య ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

వేర్పాటువాద బోధకుడికి వ్యతిరేకంగా అణిచివేత సమయంలో పట్టుబడిన సిక్కు యువకులను విడుదల చేయాలని అకల్ తఖ్త్ నేత జతేదార్ గియానీ హర్‌ప్రీత్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి 24 గంటల అల్టిమేటం ఇచ్చారు. పంజాబ్‌లోని పరిస్థితులపై చర్చించేందుకు మేధావులు, న్యాయవాదులు, పాత్రికేయులు, మత, సామాజిక నేతలతో కూడిన సిక్కు సంస్థల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
Also Read:Nallapareddy Prasanna kumar Reddy: వైసీపీకి గుడ్‌బై ప్రచారం.. స్పందించిన ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి

అమృతపాల్ సింగ్‌కు మద్దతిచ్చినందుకు అరెస్టయిన వారిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టాన్ని ఎందుకు ప్రయోగించారని ప్రశ్నిస్తూ, “హిందూ రాష్ట్రాన్ని డిమాండ్ చేసేవారు లక్షల మంది ఉన్నారు. హిందూ రాష్ట్రం కోసం పిలుపునిచ్చే వారిపై కూడా కేసులు నమోదు చేయాలి. వారిపై కూడా కేసులు నమోదు చేయాలి. NSA కింద బుక్ చేయాలి” అని జతేదార్ వ్యాఖ్యానించారు. పోలీసు కస్టడీలో ఉన్న వారి విడుదల కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. సిక్కుల పరువు తీశారని ఆరోపిస్తున్న వార్తా ఛానెల్‌లను కూడా అతను టార్గెట్ చేశాడు.

మరోవైపు దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని తేలితే, ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని రాష్ట్ర పోలీసులను కోరినట్లు ముఖ్యమంత్రి మాన్ చెప్పారు. అయితే శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. కాగా, 353 మందిని ప్రివెంటివ్ కస్టడీలో ఉంచగా 197 మందిని విడుదల చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు.

Show comments