Site icon NTV Telugu

ఆ హీరో, హీరోయిన్లు విడిపోతే భరణం ఉండదా!?

Star Couple Divorce Agreement

మన సొసైటీలో ఓ జంట విడిపోతే భార్యకు భర్త భరణం ఇవ్వాల్సి ఉంటుంది. అసలు పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు నమ్మకంతో చేసుకునేది. వారికి వారి కుటుంబాల అండ దండ అదనపు బలంగా ఉంటాయి. అయినా ఎన్నో జంటలు ఆ నమ్మకాలను నిలుపుకోలేక విడిపోతుంటారు. అలా విడిపోయినపుడే భార్య భరణం కోరుతుంది. భర్తకు ఉన్న ఆస్తిని బట్టి తను చెల్లించటానికి ఒప్పుకుంటాడు. అయితే పెళ్ళి పెటాకులు అయినా తర్వాత భరణం వంటివి కోరకూడదని పెళ్ళికి ముందే అగ్రిమెంట్ రాసుకుంటే… నిజంగా ఆ పెళ్ళి కలకాలం నిలబడుతుందా!?

ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే ఇద్దరు హీరో, హీరోయిన్లు ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకుంటూ అలాంటి అగ్రిమెంట్ ను రాసుకున్నట్లు వినిపిస్తోంది. నిజానికి ఇలాంటికి ప్యాశ్చాత్య దేశాల్లోనూ, ఇటీవల కాలంలో బాలీవుడ్ లోనూ ఉంటాయని టాక్. అయితే మన టాలీవుడ్ లో కూడా అలాంటి అగ్రిమెంట్ జరిగింది అంటే ఆశ్చర్యం కలగక మానదు.

Read Also : “రిపబ్లిక్” ఫస్ట్ రివ్యూ

ఆ హీరోకి వారసత్వంగా వేల కోట్ల ఆస్తి ఉంది. ఆ హీరోయిన్ కూడా బాగానే సంపాదించింది. తనకి కూడా వందల కోట్ల ఆస్తి ఉంది. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గానే రాణిస్తోంది. నాలుగేళ్ళ క్రితం వారిద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు ప్రముఖ లాయర్ సమక్షంలో ఓ అగ్రిమెంట్ చేసుకున్నారట. దాని ప్రకారం భవిష్యత్ లో ఇద్దరికీ పొసగక విడిపోవలసి వస్తే ఎవరూ ఎవరి ఆస్తిని కోరరాదని పక్కాగా రాసుకున్నారట.

ఎంతో ముందుచూపుతో రాసుకున్న ఈ ఒప్పందం వినటానికి వినసొంపుగానే ఉంది. అయితే ‘పెళ్ళంటే నూరేళ్ళ పంట. అది ఉండాలి కోరుకున్న వారి ఇంట కలకాలం’ అన్నారో సినీ కవి. కానీ అలా కోరుకుని కలకాలం కలిసి ఉండాలనే నమ్మకంతో కొత్త జీవితంలోకి అడుగుపెడతారు. ఆస్తులపై ఆశతో పెళ్ళికి ముందే అలా అగ్రిమెంట్ చేసుకున్నారంటే ముందుగానే అపనమ్మకం ఉందా!? నిజంగా ఆ జంట అలాంటి ఒప్పందం చేసుకుందా!? ఎవరూ విడిపోతున్నట్లు క్లారిటీ ఇవ్వలేదు సరికదా… ఆ వార్తలు నిజం కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. అది నిజమే అయితే నిజంగా సంతోషించాల్సిన విషయమే. లెట్స్ హోప్ సో!

Exit mobile version