టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. ఫోరెన్సిక్ నివేదికలో డ్రగ్స్ వాడనట్లుగా నివేదిక రావడంతో 16 మంది సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చింది. పూరి జగన్నాథ్, చార్మి, నవదీప్, రవితేజ, సుబ్బరాజు, తరుణ్, నందు, తనీష్, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ లో తోపాటు ఆరుగురికి క్లీన్ చిట్ ఇచ్చారు.
2017లో ఎక్సైజ్ సిట్ దర్యాప్తు చేసిన కేసులో చార్జిషీట్ దాఖలు కాగా.. రంగారెడ్డి ఎక్సైజ్ కోర్టులో సిట్ చార్జిషీట్ దాఖలు చేసింది. 16 మంది సినీ ప్రముఖులు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలో సిట్ పొందుపరచింది. సేకరించిన నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని లేకపోవడంతో 16 మంది సినీ ప్రముఖులకు ఫోరెన్సిక్ ల్యాబ్ క్లీన్ చిట్ ఇచ్చారు. సినీ ప్రముఖులు ఎవరూ కూడా డ్రగ్స్ వాడినట్లుగా ఆధారాలు లభ్యం కాలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చేసింది. విచారణ సమయంలో 16 మంది దగ్గర నుంచి చేతి వేళ్ళ గోర్లు వెంట్రుకలు రక్తనమూనాలను సేకరించి ఎక్సైజ్ అధికారులు ఎఫ్ఎస్ఎల్ పంపారు. 16 మంది సినీ ప్రముఖుల నమూనాల్లో డ్రగ్స్ ఆధారాలు లభ్యం కాలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ పేర్కొంది.