Site icon NTV Telugu

టుడే కోవిడ్ అప్ డేట్

  1. దేశంలో కరోనా కేసుల స్వల్ప తగ్గుదల నమోదైంది. దేశంలో తాజాగా 2,58,089 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 385 మంది మృతి చెందిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా నుంచి 1,51,740 మంది కోలుకున్నారు.కర్ణాటకలో కొత్తగా 27,156 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా 14 మంది మృతి చెందారు. పాజిటివిటీ రేటు 16 శాతం నుంచి 19 శాతానికి పెరిగిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి.
  2. దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 8209 ఒమిక్రాన్ కేసులు న‌మోదైన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. సుమారు 160 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించిన‌ట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు. భార‌త్‌లోని 29 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు
  3. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపింది. మొత్తం 120 మంది వైద్యులకు కరోనా సోకింది. అందులో 40 మంది పీజీ విద్యార్థులు, 38 మంది హౌస్‌ సర్జన్లకు కరోనా వచ్చింది. 35 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు, ఆరుగురు ఫ్యాకల్టీకి కరోనా పాజిటివ్‌ అని తేలింది. మరికొంతమంది కరోనా రిపోర్టులు రావాల్సి వున్నాయి.
  4. తెలంగాణలో కొత్తగా 2447 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటికంటే కాస్త పెరుగుదల నమోదయింది. కోవిడ్ కారణంగా ముగ్గురు మృతిచెందారు. రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు 96.31శాతంగా వుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 22,197 వున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,11,656కు చేరుకోగా.. రికవరీ కేసులు 6,85,399కు పెరిగాయి.
  5. ఏపీలో కొత్తగా 4,108 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏపీలో ప్రస్తుతం 30,182 కరోనా యాక్టివ్‌ కేసులు వున్నాయి. కరోనా ఆంక్షలు మళ్ళీ అమలులోకి వచ్చాయి. ఏపీలో కోవిడ్ పరిస్థితుల‌పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష జరిపారు. వివిధ ప్రాంతాల్లో కోవిడ్ ప‌రిస్థితుల‌ను సీఎంకు వివ‌రించారు అధికారులు. ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామ‌ని తెలిపారు అధికారులు.
Exit mobile version