వచ్చే ఏడాది దేశంలోని అనేక రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో గోవా కూడా ఒకటి. ఎలాగైనా గోవాలో అధికారం అధికారంలోకి రావాలని కాంగ్రెస్, ఆప్, తృణమూల్ కాంగ్రెస్‌లు చూస్తున్నాయి. ఆయా పార్టీల నేతలు ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టి హమీలు గుప్పిస్తున్నారు. నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ గోవాలో పర్యటించి మహిళలను ఆకట్టుకునే విధంగా హామీలు ఇచ్చారు. 24 గంటలు గడవక ముందే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు భారీ వరాలు ప్రకటించింది. రాష్ట్రంలో తమను గెలిపిస్తే గృహలక్ష్మీ పథకం కింద ప్రతి మహిళకు నెలకు 5వేలు చొప్పున వారి ఖాతాలో వేస్తామని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది.
Read: ఐపీఓ: ప్రైవేట్ సంస్థలు దూకుడు… మందగించిన పబ్లిక్ రంగం…
త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన కార్డులను పంపిణీ చేస్తామని, అధికారంలోకి వచ్చిన తరువాత కార్డుపైని యూనిక్ ఐడింటిఫికేషన్ నెంబర్ ఆధారంగా నగదు పంపిణీ చేస్తామని టీఎంసీ ఎంపీ మెహువా మొయిత్రీ అన్నారు. ఈ పథకం ద్వారా గోవాలోని 3.5 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరుతుందని, అధికారంలో ఉన్న బీజేపీ ప్రస్తుతం నెలకు రూ. 1500 మాత్రమే ఇస్తోందని, తాము అధికారంలోకి వస్తే దీనిని రూ.5 వేలుగా మారుస్తామని అన్నారు.
