Site icon NTV Telugu

Navami Shobha Yatra: హైదరాబాద్‌లో రామనవమి శోభ యాత్ర.. ఆ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత

Rama Navami Shobha Yatra

Rama Navami Shobha Yatra

హైదరాబాద్ లో శ్రీ రామ నవమి ఘనంగా జరుగుతున్నాయి. రామ నవమి శోభ యాత్ర సజావుగా సాగేందుకు హైదరాబాద్ పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం దాదాపు 1,500 మంది పోలీసులను శోభాయాత్రను పర్యవేక్షించేందుకు నియమించారు. రామ నవమి శోభ యాత్ర ఊరేగింపు గురువారం ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్ ఆలయం నుండి ప్రారంభమై, రాత్రి 7 గంటలకు కోటిలోని హనుమాన్ వ్యామశాల మైదానంలో ముగుస్తుంది.

Also Read:Karnataka polls: గిరిజన వర్గాలపై ఈసీ దృష్టి.. ‘జాతి పోలింగ్ కేంద్రాలు’ ఏర్పాటు

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సహా సీనియర్ పోలీసు అధికారులు ఊరేగింపును పర్యవేక్షిస్తారు. సున్నితమైన ప్రదేశాలలో, పోలీసు పికెట్లను ఏర్పాటు చేస్తారు. ఊరేగింపు ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిఘా, డ్రోన్ కెమెరాల సహాయంతో ఊరేగింపును పర్యవేక్షిస్తుంది. అదనంగా, IT సెల్ యొక్క సోషల్ మీడియా బృందం, స్మాష్ బృందం శాంతియుత వాతావరణానికి భంగం కలగకుండా చూసేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిఘా ఉంచుతుంది.
Also Read: bomb blast case: రాజస్థాన్ కోర్టు సంచలన తీర్పు.. బాంబు పేలుళ్ల కేసులో నిందితులు విడుదల

ఇదిలా ఉండగా, ఊరేగింపుకు ముందు, సిద్దిఅంబర్ బజార్ మసీదు మరియు దర్గాను గుడ్డతో కప్పారు. నవమి శోభయాత్ర సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్ మళ్లించారు. వాహనదారులు, ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లి జంక్షన్, బోయిగూడ కమాన్, అఘపురా జంక్షన్, గోడే-కి-ఖబర్, పురానాపూల్ ఎక్స్ రోడ్, MJ బ్రిడ్జి, లేబర్ అడ్డా, అలాస్కా T జంక్షన్, SA బజార్ యు టర్న్, MJ మార్కెట్ లో ట్రాఫిక్ ను మళ్లించారు. కాగా, సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్‌గంజ్ టి జంక్షన్, రంగమహల్ జంక్షన్, పుత్లిబౌలి ఎక్స్ రోడ్, ఆంధ్రా బ్యాంక్ ఎక్స్ రోడ్, డిఎమ్ & హెచ్‌ఎస్ ఎక్స్ రోడ్, సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్, చాదర్‌ఘర్ ఎక్స్ రోడ్, కాచిగూడ ఐనాక్స్, జిపిఓ అబిడ్స్, యూసుఫియాన్ & కంపెనీ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Exit mobile version