NTV Telugu Site icon

ఆ హోట‌ల్‌లో ఏం తిన్నా రూ.10 రూపాయ‌లే… ఎక్క‌డో తెలుసా…

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అంటే క‌నీసం రూ.50 అవుతుంది.  స‌రే ఇంట్లో వండుకుందామ‌ని అనుకున్నా ఒక్కొక్క‌రికి క‌నీసం రూ.30 నుంచి రూ.40 వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంది.  నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు, గ్యాస్ ధ‌ర‌లు పెరిగిపోవ‌డంతో బ్రేక్‌ఫాస్ట్ నుంచి భోజ‌నం వ‌ర‌కు ధ‌ర‌లు పెరిగిపోయాయి.  దీంతో ప్ర‌జ‌లు అవ‌స్త‌లు ప‌డుతున్నారు.  ఇక ఇదిలా ఉంటే, ఆ హోట‌ల్‌లో ఏ బ్రేక్ ఫాస్ట్ తీసుకున్నా రూ.10 చెల్లిస్తే స‌రిపోతుంది.  దోశ‌, ఇడ్లీ, పూరీ, వ‌డ, ఉగ్గాని ఇలా ఏది తీసుకున్నా స‌రే ప్లేటుకు రూ.10 చెల్లిస్తే చాలు.  నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు పెరుగుతున్నా త‌మ హోట‌ల్‌లో ధ‌ర‌లు పెంచ‌లేద‌ని అంటున్నారు రేణుక హోట‌ల్ నిర్వాహ‌కులు.  Read: డేంజ‌ర్ బెల్స్‌: 2030 నాటికి కోల్‌క‌తా న‌గ‌రం…
గ‌త ప‌దేళ్లుగా హోట‌ల్‌ను నిర్వ‌హిస్తున్నార‌ట‌.  అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ధ‌ర‌లు పెంచ‌లేద‌ని హోట‌ల్ నిర్వ‌హ‌కులు చెబుతున్నారు.  ఈ హోట‌ల్ క‌ర్నూలులోని రోజా వీధిలో ఉన్న‌ది.  ఉద‌యం, సాయంత్రం స‌మ‌యంలో టిఫెన్‌ను అందిస్తున్న‌ట్టు నిర్వ‌హకులు చెబుతున్నారు.