NTV Telugu Site icon

Japanese Tourist: హోలీ వేడుకల్లో వేధింపులు.. దేశం వీడిన బాధితురాలు

Holi 1

Holi 1

హోలీ వేడుకలు సందర్భంగా ఢిల్లీలో జపాన్‌కు చెందిన ఓ మహిళను కొందరు యువకులు వేధింపులకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ వేధింపులకు పాల్పడిన కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భారత పర్యటనకు వచ్చిన జపాన్ యువతి ఢిల్లీలోని పహర్‌గంజ్‌లో ఉంటోంది. హోలీ వేడుకల సందర్భంగా ముగ్గురు యువకులు సదరు యువతిపై బలవంతంగా రంగులు చల్లి, కోడి గుడ్లు కొట్టారు. కోడిగుడ్డు కొట్టి ముఖమంతా పులిమారు. ఆమె వద్దని వారిస్తున్నా వినకుండా రెచ్చిపోయారు. ఈ క్రమంలో ఆమె ఓ యువకుడిపై చేయి కూడా చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అయింది. దీంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: Anil Kumar Yadav: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనైతిక పొత్తులకు బుద్ధి చెప్పండి

నిందితులు పహాడ్‌గంజ్ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. వారిలో ఓ మైనర్ కూడా ఉన్నట్టు చెప్పారు. అయితే.. యువతి మాత్రం నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది. ఇక ఘటన అనంతరం జపాన్ యువతి తన పర్యటనను కొనసాగించింది. తాజాగా బంగ్లాదేశ్ చేరుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించింది. ప్రస్తుతం తాను శారీరకంగా, మానసికంగా పూర్తి ఫిట్‌గా ఉన్నానని యువతి చెప్పింది.