NTV Telugu Site icon

వైర‌ల్‌: బిచ్చ‌గాడి అంతిమ‌యాత్ర‌కు భారీగా హాజ‌రైన జ‌నం…ఇదే కార‌ణం…

సాధార‌ణంగా ఎవ‌రైన బిచ్చ‌గాళ్లు మ‌ర‌ణిస్తే వారిని మున్సిప‌ల్ సిబ్బంది త‌మ వాహ‌నంలో త‌ర‌లించి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తారు.  ఈ విష‌యాలు పెద్ద‌గా బ‌య‌ట‌కు రావు.  అయితే, క‌ర్ణాట‌క‌లోని విజ‌య‌న‌గ‌ర జిల్లాలోని హ‌విన‌హ‌డ‌గ‌లిలో హుచ్చ‌బ‌స్య‌ అనే యాచ‌కుడు మ‌ర‌ణించాడు.  ఆయ‌న మ‌ర‌ణించాడ‌ని తెలుసుకున్న హ‌విన‌హ‌డ‌గ‌లి ప్ర‌జ‌లు సోక‌స‌ముద్రంలో మునిగిపోయారు.  హుచ్చ‌బ‌స్య‌ అంతిమ‌యాత్ర‌ను ఘ‌నంగా చేయాల‌ని ప్ర‌జలు నిర్ణ‌యం తీసుకొని పెద్ద ఎత్తున ఊరేగింపుగా అంతిమ‌యాత్ర‌ను నిర్వ‌హించి ఘ‌నంగా అంతిమ సంస్కారం నిర్వ‌హించారు.  ఈ అంతిమ‌యాత్ర‌లో ప్ర‌జ‌లంతా స్వ‌చ్ఛందంగా పాల్గొన్నారు.  

Read: హెచ్చ‌రిక‌: మా డ‌బ్బు మాకివ్వండి… లేదంటే ప్ర‌పంచానికే పెనుముప్పు…

హుచ్చ‌బ‌స్య‌ ప‌ట్ట‌ణంలో ఎన్నో ఏళ్లుగా నివ‌శిస్తున్నాడు.  ప‌ట్ట‌ణంలో ప్ర‌తి ఒక్క‌రికి హుచ్చ‌బ‌స్య‌  గురించి తెలుసు.  ఆయ‌న అంద‌ర్ని ప‌ల‌క‌ల‌రిస్తూ ఒక్క‌రూపాయి మాత్ర‌మే యాచించి తీసుకునేవాడు.  అంత‌కంటే ఎక్కువ ఇస్తే తీసుకునేవాడు కాదు.  ఆయ‌న‌కు రూపాయి ధ‌ర్మం చేయ‌డం వ‌ల‌న మంచి జ‌రుగుతుంద‌ని ప్ర‌జ‌ల న‌మ్మ‌కం.  అందుకే హ‌చ్చ‌బ‌స్య క‌నిపిస్తే రూపాయి ఇచ్చేసేవారు అక్క‌డి ప్ర‌జ‌లు.  ఇక దేవాల‌యాల్లో లేదా పాఠ‌శాల‌ల్లో త‌ల‌దాచుకునేవాడు.  అయితే, శ‌నివారం రోజున ఆయ‌న రోడ్డు ప్ర‌మాదానికి గురికావడంతో స్థానికులు ఆసుప‌త్రిలో చేర్పించారు.  చికిత్స పొందుతూ మ‌ర‌ణించ‌డంతో ప్ర‌జ‌లు శోక‌స‌ముద్రంలో మునిగిపోయారు.  ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులు ఎవ‌రు క‌నిపించినా పేరుపెట్టి పిలిచి రూపాయి ధ‌ర్మం అడిగి తీసుకునేవాడ‌ట హ‌చ్చ‌బ‌స్య‌.  ఆయ‌న్ను అక్క‌డ అంతా అదృష్ట బ‌స్య అని పిలుస్తుంటారు.