హెచ్చ‌రిక‌: మా డ‌బ్బు మాకివ్వండి… లేదంటే ప్ర‌పంచానికే పెనుముప్పు…

ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్‌లు ఆక్ర‌మించుకున్నాక ఆ దేశానికి చెందిన నిధుల‌ను అమెరికా ఫ్రీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే.  దీంతో ఆ దేశం నిధుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.  విదేశాల నుంచి వ‌చ్చే దిగుమ‌తులు ఆగిపోయాయి.  దేశంలో ఆహార సంక్షోభం తీవ్రంగా వేధిస్తున్న‌ది.  శీతాకాలంలో ఈ స‌మ‌స్య మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉన్న‌ది.  ఆహారం, ఉద్యోగ స‌మ‌స్య‌లు తీవ్రంగా ఉండ‌టంతో ఆఫ్ఘ‌న్ నుంచి ప్ర‌జ‌లు వ‌ల‌స వెళ్తున్నారు.  శీతాకాలంలో ఈ వ‌ల‌స‌లు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉన్న‌ది.  దీంతో తాలిబ‌న్ నేత‌లు ప్ర‌పంచానికి హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు.  

Read: కేసీఆర్‌ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నారు: విజయశాంతి

త‌మ‌కు రావాల్సిన 9 బిలియ‌న్ డాల‌ర్ల నిధుల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని, లేదంటే ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి వ‌ల‌స‌లు పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని, వ‌ల‌స‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఇబ్బందులు ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని తాలిబ‌న్ నేత‌లు హెచ్చ‌రించారు. అమెరికా త‌మ సెంట్ర‌ల్ బ్యాంక్ నిధుల‌ను, ఆస్తుల‌ను స్తంభింప‌జేయ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని, దోహ ఒప్పందానికి విరుద్దంగా అమెరికా ప్ర‌వ‌ర్తిస్తోందని తాలిబ‌న్ నేత‌లు చెబుతున్నారు.  

Related Articles

Latest Articles