Site icon NTV Telugu

వారు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు : సీఎం జగన్‌

ఏపీ ప్రభుత్వం నిన్న ఇళ్ల పట్టాలతో సహా 16 సంక్షేమ పథకాల అర్హులై లబ్దిపొందని వారికి వారి ఖాతాలలో నగుదను జమ చేసింది. ఇప్పటివరకు సంక్షేమ పథకాల లబ్ధిని పొందని 18.48 లక్షల మంది ఖాతాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించి రూ.703 కోట్లను సీఎం జగన్‌ జమ చేశారు. అయితే నిన్న ప్రభుత్వం జమ చేసిన నగదు, ఇతర సంక్షేమ పథకాలు అందని అర్హులెవరైనా ఉంటే వారు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం జగన్‌ వెల్లడించారు.

అయితే ఈ నగదును ప్రతి సంవత్సరం జూన్‌, డిసెంబర్‌ నెలలలో రెండు దఫాలుగా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్‌ నుంచి మే వరకు అమలైన పథకాలు లబ్దిపొందని వారికి రెండో విడుతలో అందిస్తామని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా^చేపడుతామని జగన్‌ తెలిపారు.

Exit mobile version