Site icon NTV Telugu

క‌రోనా ఎఫెక్ట్‌: ఆ దేశాల్లో వారంలో నాలుగురోజులే ప‌ని…

క‌రోనా, ఒమిక్రాన్ వేరియంట్‌లు వేగంగా పెరుగుతున్న‌వేళ అనేక దేశాల్లో ఐదు రోజుల ప‌నివేళ‌ల‌ను నాలుగు రోజుల‌కు కుదిస్తూ అక్క‌డి ప్ర‌భుత్వాలు నిర్ణ‌యం తీసుకున్నాయి.  2020 నుంచి ప్ర‌పంచాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ణికిస్తోంది.  ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు వీలు లేక‌పోవ‌డంతో వ‌ర్క్‌ఫ్ర‌మ్ హోమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఉద్యోగాల విష‌యంలో మ‌రిన్ని వెసులుబాట్లు క‌ల్పించేందుకు వివిధ దేశాలు సిద్ధ‌మ‌య్యాయి.  రోజుకు ప‌నివేళ‌ల‌ను పెంచి, ప‌ని దినాల‌ను తగ్గించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.  

Read: లైవ్‌: పులివెందుల క్రిస్మ‌స్ వేడుకల్లో సీఎం వైఎస్ జ‌గ‌న్‌…

జ‌పాన్‌లో 2021 కి ముందు నుంచే వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను అమ‌లు చేస్తున్నారు.  వారంలో ఐదు రోజులు ప‌నిచేస్తున్నారు.  ప‌ని వేళ‌లు పెర‌గ‌డంతో పాటు, ఒత్త‌డి పెర‌గ‌డంతో ప‌ని దినాల‌ను త‌గ్గించాల‌ని డిమాండ్ చేశారు.  దీంతో జ‌పాన్ ప్ర‌భుత్వం వారంలో నాలుగు రోజుల ప‌ని దినాల‌ను అమ‌లు చేస్తున్న‌ది.  న్యూజిలాండ్‌లోనూ వారంలో నాలుగు రోజుల ప‌నిదినాల‌ను అమ‌లు చేస్తున్న‌ది.  దీంతో ప్రొడ‌క్ట‌విటీ పెరుగుతుంద‌ని ఆ దేశ ప్ర‌ధాని పేర్కొన్న‌ది.  ప్ర‌పంచంలో అత్యంత త‌క్కువ ప‌నిదినాలు ఉన్న దేశం ఐర్లాండ్ అని చెప్పాలి.  అక్క‌డ మ‌హిళ‌లు వారంలో 25 గంట‌లు, పురుషులైతే వారంలో 34 గంట‌లు ప‌నిచేయాల్సి ఉంటుంది.  దీంతో అక్క‌డ నిరుద్యోగుల శాతం 3.3 మాత్ర‌మే ఉన్న‌ది.  ఐస్‌లాండ్‌లోనూ వారంలో నాలుగు రోజులు ప‌నిచేసే విధానాన్ని తీసుకొచ్చి విజ‌యం సాధించింది.  యూఏఈలోనూ వారంలో 4.5 రోజుల ప‌ని దినాలు క‌ల్పిస్తోంది.  స్పెయిన్‌లోనూ వారంలో నాలుగు రోజులు మాత్ర‌మే ప‌నిదినాలు ఉంటాయి.  ఆయా దేశాల్లో ప్రోడ‌క్టివిటి పెర‌గ‌డానికి ఇదే కార‌ణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు.  దీంతో ఈ విధానాల‌ను ఇండియాలోనూ అమ‌లు చేసేందుకు కేంద్రం సిద్ధం అవుతున్న‌ది.  

Exit mobile version