ప్రపంచ వాతావరణంలో మార్పులు వేగంగా మారిపోతున్నాయి. పర్యావరణానికి హాని కలిగించే ఉద్గారాలు ఇబ్బడిముబ్బడిగా వాతావరణంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో వేడి పెరిగిపోయింది. ఈ వేడి కారణంగా దృవాల వద్ద మంచు భారీగా కరిగిపోతున్నది. ఫలితంగా నదుల్లో, సముద్రాల్లో నీటిమట్టం పెరిగిపోతున్నది. నీటిమట్టం పెరగడం వలన తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఇబ్బందులు ఎదర్కొననున్నాయి. 2030 నాటికి సముద్రాల్లోని నీటిమట్టం భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి మట్టం పెరిగితే అనేక నరగాలు నీటమునిగే అవకాశం ఉన్నది. ఇందులో ఇండియాలోని చారిత్రాత్మక మహానగరం కోల్‌కతా కూడా ఉన్నది.
Read: అమెరికా సైనికులు కాపాడిన ఆ బాలుడు ఏమయ్యాడు…?
కోల్ కతా మహానగరంలో చాలా వరకు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోల్‌కతా తో పాటుగా 2030 నాటికి అమెరికాలోని న్యూ ఓర్లాన్స్, ఇటలీలోని వెనీస్, వియాత్నంలోని హోచీ మిన్ సిటీ, నెదర్లాండ్స్‌లోని చారిత్రాత్మక నగరం అమ్‌స్టర్‌డామ్, ఇరాక్‌లోని బస్రా నగరాలు నీట మునిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.