Site icon NTV Telugu

బ్రేకింగ్‌ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఎన్డీయే పాలిత ప్రాంతాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా తమ ప్రజలపై భారం తగ్గించేందుకు రాష్ట్ర వ్యాట్‌ను కూడా తగ్గించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆధ్యాయనం చేస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గింస్తే రాష్ట్ర ఆదాయాంపై పడే భారంపై అధికారులతో చర్చిస్తోంది.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వెంటనే తగ్గించే పరిస్థితి లేదని అధికారులు ప్రభుత్వానికి వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తగ్గించిన సుంకం కారణంగా రాష్ట్రానికి ప్రతి నెల రూ.100 కోట్ల మేర ఆదాయం తగ్గుతుందని అధికారులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు రాష్ట్ర వ్యాట్‌ను తగ్గించాలంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

Exit mobile version