NTV Telugu Site icon

ప్రెషర్‌ కుక్కర్‌ను ఇలా కూడా వాడొచ్చా..?

బుర్రకో బుద్ది, జిహ్వకో రుచి అని పెద్దలు ఊరికే అనలేదు. ఎందుకంటే ఈ సమాజంలో ఓ వస్తువును ఒక్కొక్కరు ఒక్కోలా వాడుతుంటారు. కొందరు మరింత వైవిధ్యంగా ఆలోచించి చేసే పనులు పలు సార్లు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అయితే అలాంటిదే ఈ వీడియో.. మామూలుగా మనం ప్రెషర్‌ కుక్కర్‌ను వంటకు ఉపయోగిస్తుంటాం.

కానీ.. ఓ యువకుడు వెరైటీగా ఆలోచించి ప్రెషర్‌ కుక్కర్‌ నుంచి వచ్చే ఆవిరిని ఉపయోగించి తన జట్టును ఆరబెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రెషర్‌ కుక్కర్‌ను ఇలా కూడా వాడొచ్చా అని ఆశ్చర్యపోతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://www.instagram.com/p/CVvfbmKt7QZ/