Site icon NTV Telugu

ఎయిర్‌పోర్ట్‌లో నెగిటివ్.. ఇంటికాడ పాజిటివ్..

కరోనా మహమ్మారి ఒమిక్రాన్‌గా రూపాంతరం చెంది మరోసారి ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తుంది. ఈ వేరియంట్‌ ఇప్పటికే భారత్‌లో ప్రవేశించేసరికి విమాన ప్రయాణాలపై ఆంక్షాలు విధించారు. అంతేకాకుండా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వెలుగులోకి వచ్చిన తరువాత ఒమిక్రాన్‌ సోకిన దేశాల నుంచి గత నెలలో వచ్చిన వారిని ట్రేసింగ్‌ చేసి టెస్టింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఉమిలాడా గ్రామంలో అర్జాల గోపాల కృష్ణ (51) అనే వ్యక్తి గత నెల 23న దక్షిణాఫ్రికా నుంచి వచ్చాడు.

అయితే గోపాల కృష్ణ ఇండియాకు వచ్చిన తరువాత ఎయిర్‌పోర్టులో నిర్వహించిన టెస్టుల్లో నెగిటివ్ రావడంతో అతనిని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు విడిచిపెట్టారు. అయితే గత నెలలో విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రేసింగ్‌ చేసి టెస్టింగ్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించడంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 4న సంతబొమ్మాళి గ్రామంలోని పీహెచ్‌సీలో నిర్వహించిన ఆర్‌టీపీసీఆర్‌ టెస్టుల్లో గోపాల కృష్ణకు పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఒక్కసారి స్థానికంగా కలకలం రేగింగి. అయితే గోపాల్‌ కృష్ణను ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గోపాల కృష్ణ దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన క్రమంలో అతని శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ టెస్టుకు పంపించారు.

Exit mobile version