Site icon NTV Telugu

దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్య..

ఇప్పటికే డెల్టా వేరియంట్‌ సతమతమవుతున్న భారత్‌కు ఒమిక్రాన్‌ టెన్షన్‌ మొదలైంది. ఇటీవల భారత్‌లోకి ప్రవేశించిన ఈ వేరియంట్‌ క్రమక్రమంగా రాష్ట్రాలను ఆక్రమిస్తోంది. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా 89 ఒమిక్రాన్‌ కేసులు నమోదవడంతో దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 361కు చేరింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కోవిడ్‌ నిబంధనలు మరోసారి కఠినతరం చేస్తున్నారు.

ఢిల్లీలో క్రిస్మస్‌, న్యూయర్‌ వేడుకలపై నిషేధం విధించారు. అలాగే ముంబైలో రాత్రిపూట 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. గుజరాత్‌లోని 9 నగరాల్లో, మధ్యప్రదేశ్‌లో నైట్‌ కర్ఫ్యూను విధించారు. కర్నాటకలో సామూహిక వేడుకలపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. యూపీలో ఈ నెల 31 వరకు 144 సెక్షన్‌, కేరళలోని పర్యాటక ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఒమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఒమిక్రాన్‌ కట్టడికి చర్యలు తీసుకోవాలని వెల్లడించింది.

https://ntvtelugu.com/whats-today-updates-24-12-2021/
Exit mobile version