NTV Telugu Site icon

Pingali Venkaiah Jayanti: జాతీయ జెండా రూపకర్త తెలుగోడే..పతాకం డిజైన్ కోసం ఐదేళ్లు శ్రమ

Pingali

Pingali

భారతదేశ త్రివర్ణ పతాకం రూపకర్త ఎవరో తెలుసా? ఆయన తెలుగు జాతి రత్నమన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈరోజు (ఆగస్టు 2) మన ప్రియతమ త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య జయంతి. పింగళి వెంకయ్య భారత జాతీయ జెండాను రూపొందించడానికి చాల కష్టపడ్డారు. త్రివర్ణ పతాకాన్ని డిజైన్ చేయడం అంత ఈజీ కాదు. ఇందుకోసం పింగళి వెకైన్య ఐదేళ్లపాటు ప్రపంచవ్యాప్తంగా జాతీయ జెండాలపై అధ్యయనం చేశారు. దీని తరువాత ఆయన సుమారు 30 డిజైన్లను సమర్పించారు. వాటిలో త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా ఎంపిక చేశారు.

READ MORE: Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధించిన ఆ దేశం..

త్రివర్ణ పతాకం డిజైన్ ఎలా తయారు చేయబడింది?
భారతదేశ జాతీయ జెండాను సిద్ధం చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే దానిని తయారు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పింగళి వెంకయ్యకు చెందుతుంది. ప్రస్తుత కృష్ణా జిల్లా, మొవ్వ మండలం భట్లపెనుమర్రులో 1876 ఆగస్టు 02న ఆయన జన్మించారు. ఆయన తెలుగోడు కావడం మనకు గర్వకారణం. పింగళి వెంకయ్య స్వాతంత్ర్య సమరయోధుడు. వ్యవసాయ శాస్త్రవేత్త కూడా. నిజానికి కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదివిన వెంకయ్య మహాత్మా గాంధీని కలిశారు. భారతదేశానికి జెండా తయారు చేయమని గాంధీ స్వయంగా వెంకయ్యను అడిగారు గాంధీ.

READ MORE:KTR: తెలుగు యూనివ‌ర్సిటీకి సుర‌వ‌రం ప్రతాప్ రెడ్డి పేరు పెడితే స్వాగ‌తిస్తాం..

దీంతో వెంకయ్య 1916 నుంచి 1921 వరకు దాదాపు ఐదేళ్లపాటు ప్రపంచ దేశాల జెండాలను అధ్యయనం చేశారు. ఆయన భారత జెండా కోసం దాదాపు 30 డిజైన్లను సమర్పించారు. ఇందులో మొదటగా ఓ జెండాను ఎంపిక చేశారు. ఇందులో ఆకుపచ్చ, ఎరుపు రంగుల రెండు చారలు, జెండా మధ్యలో మహాత్మా గాంధీ యొక్క స్పిన్నింగ్ వీల్(రాట్నం) ఉన్నాయి. 1921లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తొలిసారిగా గాంధీని కలుసుకుని ఎరుపు, ఆకుపచ్చ రంగులతో తయారు చేసిన జెండాను చూపించారు.

READ MORE:Raai Laxmi : స్విమ్మింగ్ పూల్లో కళ్లు చెదిరే అందాలతో అదరగొట్టేసిన రాయ్ లక్ష్మీ

ఆ తర్వాత వెంకయ్య తయారు చేసిన గాంధీ చరఖా, రెండు గీతలతో కూడిన జెండా వాడుకలోకి వచ్చింది. కాంగ్రెస్ సమావేశాల్లో ఈ జెండాను ఉపయోగించడం ప్రారంభించారు. కాగా, జలంధర్‌కు చెందిన లాలా హంసరాజ్‌ వెంకయ్యను కలిసి జెండాకు సంబంధించి కొన్ని సూచనలు చేశారు. లాలా హంసరాజ్ జెండా మధ్యలో సర్కిల్ గుర్తును తయారు చేయాలని సూచించారు. ఈ జెండాలో శాంతికి చిహ్నంగా తెలుపు రంగును కూడా చేర్చాలని గాంధీ వెంకయ్యకు సూచించారు. అంటే త్రివర్ణ పతాకంలోని చక్ర క్రెడిట్ లాలా హంసరాజ్‌కి, తెలుపురంగు చేర్చిన ఘనత గాంధీకి దక్కుతుంది.

READ MORE:Intel Layoffs: 15,000 ఉద్యోగులను తొలగించిన ఇంటెల్..

భారత జెండా మారుతూ వచ్చింది. 1931లో కుంకుమ, తెలుపు, ఆకుపచ్చ రంగులతో తయారు చేసిన జెండాను కాంగ్రెస్ ఆమోదించింది. అయితే, ఇది వరకు జెండాలో అశోక చక్రం లేదు. కానీ అదే సంవత్సరంలో, త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా స్వీకరించే ప్రతిపాదన ఆమోదించబడింది. ఈ జెండా ప్రస్తుత త్రివర్ణ పతాకంతో సరిపోలింది. 16 ఏళ్లుగా కాంగ్రెస్‌తో సహా దేశవ్యాప్తంగా ఈ జెండాను ఉపయోగించడం కొనసాగింది. దీని తరువాత, రాజ్యాంగ సభ 21 జూలై 1947న ఈ జెండాను జాతీయ జెండాగా ఆమోదించింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, దానిలో కేవలం ఒక మార్పు వచ్చింది. చరఖా స్థానంలో అశోక్ చక్ర చేర్చబడింది. ఇలా చాలా సార్లు జాతీయ జెండా మారుతూ వచ్చింది.